బీన్స్ లో ఫైబర్ చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఫైబర్, పోటాషియం, మెగ్నిషియం బీన్స్ లో ఎక్కువ. కనుక బీపీ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీన్స్ లో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ ఉంటుంది. ఇది కండర పుష్టికి దోహదం చేస్తుంది. ప్రొటీన్, ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. క్యాలరీ ఇన్ టేక్ తగ్గిస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. బీన్స్ లో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల ఇది తప్పక డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారం. ఐరన్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి చాలా ఆవశ్యక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels