Haindava Title Glimpse: గూస్ బంప్స్ వచ్చేలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'హైందవ' గ్లింప్స్... దశావతార ఆలయం చుట్టూ BSS 12
Bellamkonda Sai Srinivas New Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేష్ చందు నిర్మిస్తున్న సినిమాకు 'హైందవ' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
పురాణ ఇతిహాసాల నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు, హిందూత్వ కథలకు జాతీయ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. మనదైన కథలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) సైతం అటువంటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అయ్యారు.
'హైందవ'తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Haindava Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాకు 'హైందవ' టైటిల్ ఖరారు చేశారు. లుధీర్ బైరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... మూన్‌షైన్ పిక్చర్స్ పతాకం మీద మహేష్ చందు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్త (actress Samyuktha) హీరోయిన్. ఈ రోజు సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
ఓ దట్టమైన అడవిలో దశావతార ఆలయం ఉంది. కొంత మంది దుండగులు ఆ ఆలయానికి నిప్పు పెట్టి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వాళ్లను అడ్డుకోవడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వస్తారు. ఆయన బైక్ మీద వస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు తోడుగా... సింహం, వరాహ మూర్తి, గరుడ, మత్స్యం, కూర్మం, నాగదేవత - ఇలా దశావతారాలు గ్లింప్స్‌లో దర్శనం ఇచ్చాయి. ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడంలో వీరోచితంగా చిత్రీకరించారు కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి. చివరలో హిందూయిజం సారాంశంతో ప్రతిధ్వనించే 'హైందవ' టైటిల్ రివీల్ చేశారు.
Also Read: నేనూ హిందువువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
A saga of courage, faith, and an adventure that transcends time❤️🔥#BSS12 is Titled #Haindava ~ A story rooted in divinity and fueled by adventure🔥
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) January 8, 2025
The magnificent #HaindavaGlimpse out now 💥💥https://t.co/rNfiWsHw66
Experience an EPIC LIKE NEVER BEFORE, coming soon to… pic.twitter.com/oY3W1apSIp
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. 'హైందవ' గ్లింప్స్‌లో విజువల్స్, ముఖ్యంగా శివేంద్ర కెమెరా వర్క్ బ్రిలియంట్‌గా ఉంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం స్క్రీన్ మీద వచ్చే విజువల్స్ చూసేలా ఆధ్యాత్మిక వాతావరణం ఎలివేట్ చేసింది. సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రస్తుతానికి 35 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు. ఇది కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అవీ పాన్ ఇండియా సినిమాలే.
Haindava Movie Cast And Crew: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న 'హైందవ' సినిమాకు కూర్పు: కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, ఛాయాగ్రహణం: శివేంద్ర, సంగీతం: లియోన్ జేమ్స్, సమర్పణ: శివన్ రామకృష్ణ, నిర్మాణ సంస్థ: మూన్‌షైన్ పిక్చర్స్, నిర్మాత: మహేష్ చందు, రచన - దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి.