అన్వేషించండి

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు

Raghu Rama Krishna Raju Custodial Torture Case: ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుపై వైసీపీ హయాంలో పోలీస్ కస్టడీలో చంపడానికి కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

14-Day Custody for CID Retired ASP Vijay Paul | గుంటూరు: వైసీపీ ప్రభుత్వంలో తనను పోలీస్ కస్టడీ (RRR Custodial Torture)లో హత్య చేయాలని చూశారని అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గతంలో ఆరోపించారు. ఆయన మాటలు నిజమేనని తాజాగా తేలింది. రఘురామకు కస్టడీలో వేధింపుల కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రఘురామను పోలీస్ కస్టడీలో విపరీతంగా కొట్టారని, ఆయనను లాకప్‌లో చంపడానికి కుట్ర జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

విజయ్ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

వైసీపీ ప్రభుత్వ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరైన ఆయనను దాదాపు 9 గంటలపాటు విచారించిన అనంతరం పోలీసులు విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. బుధవారం నాడు పోలీసులు గుంటూరు కోర్టులో విజయ్ పాల్‌ను హాజరుపరచారు.  18 పేజీల రిమాండ్ రిపోర్టులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన కోర్టు నిందితుడు విజయ్ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.

విజయ్ పాల్‌ను ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రఘురామను లాకప్ తో చిత్రహింసలు పెట్టిన కేసులో అసలు సూత్రధారులు ఎవరు, ఎందుకు ఇవి చేశారనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. అసలు నిజాలు రాబట్టేందుకు విజయ్ పాల్‌ను తమ కస్టడీకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

సీఐడీ ఆఫీసు నుంచి నడవలేని స్థితిలో రఘురామ వచ్చారు

రఘురామను గతంలో పోలీస్ కస్టడీలో తీవ్రంగా వేధించారని ప్రాసిక్యూషన్‌ జాయింట్‌ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సీఐడీ ఆఫీసుకు వెళ్లిన అప్పటి ఎంపీ రఘురామ కృష్ణరాజు నడవలేని స్థితిలో వచ్చారని.. ఆయన కాళ్లను తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారని తెలిపారు. కస్టడీలో రఘురామను చంపడానికి సైతం ప్రయత్నించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనపై జరిగిన దాడి, వేధింపులు, హత్యకు కుట్ర జరిగిన విషయాన్ని రఘురామ కృష్ణరాజు సైతం కోర్టులో చెప్పారు. రఘురామ కస్టడీలో వేధింపులు ఎదుర్కొన్న కేసులో నివేదిక ఇచ్చిన జీజీహెచ్‌ డాక్టర్లు సైతం నిందితులు అవుతారని పేర్కొన్నారు. గతంలో విచారణ చేపట్టిన అందర్నీ.. ఇప్పటి వరకు ఈ కేసులో 27 మందిని విచారించినట్లు తెలిపారు. తనను కస్టడీలో వేధించారని, తనను తీవ్రంగా కొట్టారని కాళ్లకు తాకిన దెబ్బల్ని సైతం రఘురామ ఆ సమయంలో వీడియో తీసి పోస్ట్ చేశారని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని, ప్రస్తుతానికి ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ అధికారికి విజయ్ పాల్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని చెప్పారు.

కస్టడీలో లేపాయాలని చూశారని రఘురామ ఆరోపణలు

గతంలో జైలు నుంచి వచ్చాక రఘురామ చెప్పిందే నిజమైంది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సైతం రఘురామ మాట్లాడుతూ.. కస్టడీలో ఉన్న సమయంలో తనను మూడుసార్లు లేపేయాలని ప్రయత్నం చేశారని సంచలన ఆరోపనలు చేయడం తెలిసిందే. జగన్ ఆదేశాలలో సీఐడీ తనను హత్య చేయాలని కుట్ర చేసిందని, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డానని రఘురామ వీడియోలో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట సంచలనానికి తెరతీశారు. 

Also Read: Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget