Bidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP Desam
కర్ణాటకలోని బీదర్...16.జనవరి. 2025 ఉదయం 10.30 గంటల ప్రాంతం. బీర్ లోని శివాజీ సర్కిల్ లో గిరి వెంకటేశ్ అనే 45ఏళ్ల వ్యక్తి..శివ కాశీనాథ అనే 35ఏళ్ల వ్యక్తి వెహికల్ నుంచి డబ్బుల బాక్స్ తీసుకుని ఏటీఎంలో ఫిల్ చేయటానికి వెళ్తున్నారు. అక్షరాలా 93లక్షల రూపాయలు ఉన్నాయి ఆ పెట్టెలో. ఈ లోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. జేబులో నుంచి కారం ప్యాకెట్ తీశారు. కారం పొడి తీసి ఏటీఎం సెక్యూరిటీస్ ఇద్దరి కళ్లల్లో కొట్టారు. వాళ్లు కళ్లు మండి తుడుచుకునే లోపు జేబులో నుంచి గన్ తీసి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరి సెక్యురిటీస్ కిందపడిపోయారు. ఆ పెట్టే తీసుకుని పారిపోయేందుకు వాళ్లు చేసిన ప్రయత్నం చూడాలి. ఓ వైపు బండి పడిపోతుంది. మరో వైపు డబ్బులు జారి కిందపడిపోయాయి పెట్టెలో నుంచి. అయినా సరే మళ్లీ నోట్ల కట్టలు తీసి పెట్టెలో పెట్టుకుని అందరూ చూస్తుండగానే పారిపోయారు. ఆ దొంగలు కాల్చిన కాల్పులుకు గిరివెంకటేశ్ అనే వ్యక్తి చనిపోయాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బీదర్ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. 93లక్షలతో పారిపోతున్న ఆ దొంగలను పట్టుకోవాలని వెంబండించారు.





















