అన్వేషించండి

Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

Tammineni Veerabhadram: ఒకప్పుడు తెలంగాణలో కీలకంగా మారిన సీపీఎం ఇప్పుడు ఉనికిలో లేకుండా పోయింది. అంతా తమ్మినేని వీరభద్రమే చేశారన్నట్లుగా ఆయనను ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది.

Did Tammineni Veerabhadram weaken the Telangana CPM:  తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, రాజకీయాలను శాసించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్  సీపీఎం ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతోంది.  పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆ పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు రావడానికి కారణం అయ్యాయి. ఇటీవలి కాలంలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తమ్మినేని వీరభద్రాన్ని  ఆపార్టీ హైకమాండ్  అభిశంసించడం.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది.

అస్తిత్వ పోరాటంలో సీపీఎం

తెలంగాణ రాజకీయాల్లో సీపీఎం ప్రస్థానం ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కింగ్ మేకర్‌గా ఉన్న ఈ పార్టీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సున్నం రాజయ్య రూపంలో భద్రాచలం నుండి ఒకే ఒక సీటు సాధించిన సీపీఎం, ఆ తర్వాత 2018 మరియు 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. గత పదేళ్లుగా చట్టసభల్లో గొంతుక లేకపోవడం ఆ పార్టీ కేడర్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నామని చెబుతున్నా, అవి ఓట్లుగా మారకపోవడం ఆ పార్టీ వైఫల్యానికి అద్దం పడుతోంది.

గ్రామస్థాయిలోనూ  క్యాడర్ నిర్వీర్యం 

కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఎంకు గట్టిక్యాడర్ ఉంటుంది. అయితే రాను రాను ఆ క్యాడర్ కూడా మారిపోతోంది.  దానికి లోకల్ పోల్సే సాక్ష్యం.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీపీఎం పరిస్థితి దయనీయంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వందలాది వార్డుల్లో పోటీ చేసినా, కేవలం   10-12  వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. అటు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒకప్పుడు వందలాది సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న పార్టీ, గత ఎన్నికల్లో కేవలం అతి తక్కువ గ్రామ పంచాయతీలకే పరిమితమైంది. నల్గొండ, ఖమ్మం వంటి తమ బలమైన జిల్లాల్లో కూడా ప్రాతినిధ్యం నామమాత్రంగా మారిపోవడం పార్టీ పతనానికి నిదర్శనం.

పార్టీని నాశనం చేశారని తమ్మినేని వీరభద్రంపై అభిశంసన

 తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ రాజకీయంగా ఎదగకపోగా, ఉన్న ఉనికిని కూడా కోల్పోయిందని కేంద్ర కమిటీ భావిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో, కొత్త రక్తాన్ని ఎక్కించడంలో ఆయన విఫలమయ్యారని, పైగా పార్టీని తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం వాడుకున్నారని విమర్శలు వచ్చాయి. సిద్ధాంతాల కంటే ముఠా రాజకీయాలకే ప్రాధాన్యత పెరగడం వల్ల సామాన్య ప్రజలు పార్టీకి దూరమయ్యారు.  అందుకే ఆయనను  సొంత పార్టీ అభిశంసించింది.  ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో, మరో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుల కోసం వెంపర్లాడటం వల్ల సీపీఎం  సొంత ఓటు బ్యాంకును. నిలబెట్టుకోలేకపోయింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల కేడర్ కూడా ఇతర పార్టీల వైపు మళ్ళింది. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో సీపీఎం విఫలమైంది. నేటితరం రాజకీయాల్లో మారుతున్న సోషల్ మీడియా సమీకరణాలను, ఆధునిక ప్రచార పద్ధతులను అందిపుచ్చుకోవడంలో పాతకాలపు పద్ధతులే ఆ పార్టీని దెబ్బతీశాయి.

తెలంగాణలో కోలుకోవడం అసాధ్యమేనా?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి బలమైన శక్తుల మధ్య సీపీఎం వంటి  పార్టీలు మనుగడ సాగించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. పార్టీ అంతర్గతంగా చీలిపోయి ఉండటం, నాయకత్వంపై నమ్మకం సడలడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కుప్పకూలింది. పార్టీ కార్యకర్తలు కూడా ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ రక్షణ లేకపోవడంతో ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ దశలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టే శక్తివంతమైన నాయకత్వం ప్రస్తుతం ఆ పార్టీలో కనిపించడం లేదు.   సీపీఎం తెలంగాణలో కోలుకోవడం ఇక దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది. కేవలం గతకాలపు వైభవాన్ని నెమరువేసుకోవడం తప్ప, భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికలు ఆ పార్టీ దగ్గర లేవు. తమ్మినేని వంటి సీనియర్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని ప్రక్షాళన చేయాలనుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన ఏ రాజకీయ పార్టీ అయినా మళ్లీ పుంజుకోవడం చరిత్రలో చాలా అరుదు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం తెలంగాణలో ఒక నామమాత్రపు శక్తిగా మిగిలిపోయే  పరిస్థితి కనిపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Embed widget