MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
ఇన్నాళ్లూ పాలునీళ్లలా కలిసి ఉన్న చెన్నై, ముంబై జట్లు ఇకపై లీగ్ లో పై చేయి సాధించే ప్రయత్నాలు జోరుగా మొదలుపెట్టేశాయి. ఈ ప్రయత్నాల్లో ఓ మెట్టు పైనే ఉన్న ముంబై ఇండియన్స్...తన కింద చెన్నై సూపర్ కింగ్స్ ను మరింత పాతాళాని తొక్కేస్తూ ఈ రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఘన విజయం. చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ వికెట్ల తేడాతో విక్టరీ కొట్టేసిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఆయుష్ అద్భుతం మాత్రే
ముంబై వాఖండే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ లోలానే షేక్ రషీద్ తో కలిసి రచిన్ ఓపెనింగ్ చేయగా...అశ్వని కుమార్ రచిన్ రవీంద్రను అవుట్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో అవుట్ చేయటంతో సీఎస్కే ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే కొత్త కుర్రాడు చెన్నై తరపున డెబ్యూ చేసిన ముంబై లోకల్ ఆటగాడు ఆయుష్ మాత్రే మాత్రం అద్భుతం చేశాడు. మొదటి ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఈ 17ఏళ్లు కుర్రాడు ఏ మాత్రం బెరుకు లేకుండా ముంబై ఇండియన్స్ బౌలర్లను ఆడుకున్నాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన ఆయుష్..చాహర్ బౌలింగ్ లో అవుటైనా ఫస్ట్ మ్యాచ్ లో నే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
2. దూబే, జడ్డూ హాఫ్ సెంచరీలు
తన ఫస్ట్ మ్యాచ్ లో బాగా ఆడిన షేక్ రషీద్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఈ మ్యాచ్ లో. ఆయుష్ అయిపోయిన కాసేపటికే రషీద్ కూడా అవుటయ్యాడు. ఈ దశలో జడ్డూకు జత కలిసి దూబే 79 పరుగులు పార్టనర్ షిప్ తో చెన్నైను నిలబెట్టాడు. జడ్డూ 35 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సులతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే..శివమ్ దూబే సిక్సర్లతో డీల్ చేశాడు. 32 బాల్స్ లో 2ఫోర్లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ధోనీ, జెమీ ఓవర్టన్ కూడా ఫెయిల్ అవటంతో చెన్నై 176పరుగులు మాత్రమే చేయగలిగింది.
3. బూమ్ బూమ్ బుమ్రా
చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా లేట్ గా బుమ్రా చేతికి బాల్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మొదట్లో ఆడిన టీనేజర్లకు దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, బౌల్ట్ లతో బౌలింగ్ చేయించి సీనియర్ బ్యాటర్ల కోసం బుమ్రాను అట్టిపెట్టి స్ట్రాటజీ అప్లై చేశాడు. ఫలితంగా బుమ్రా పరుగులు పోనివ్వకుండా CSK ని అడ్డుకోవటంతో పాటు 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి హాఫ్ సెంచరీ కొట్టిన దూబేని, హిట్టింగ్ దిగనివ్వకుండా ధోనిని అవుట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై కి 177 టార్గెట్ మాత్రమే ఉండేలా చేశాడు.
4. రోహిత్ విధ్వంసం
గత మ్యాచ్ లో మూడు సిక్సులు కొట్టి వింటేజ్ షో చూపించిన రోహిత్ శర్మ చెన్నై పై మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయాడు. 177 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటంతో పాటు భాగంగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తో కలిసి మొదటి వికెట్ కే 63పరుగుల పార్టనర్ షిప్ పెట్టాడు. అంతే కాదు 45 బంతుల్లో 4 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో సీజన్ లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటుతూ 76 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. ప్రత్యేకించి రోహిత్ ఆడిన పుల్ షాట్స్ సిక్సర్స్ ఫ్యాన్స్ కైతే ఫుల్ మీల్స్ పెట్టాయి.
5. సూర్యా భాయ్ షో
రోహిత్ శర్మ ఊతకొట్టుడు చాలదన్నట్లు రికెల్టన్ అవుటయ్యాక వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరో ఎండ్ లో చెన్నై బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. 30 బంతులు మాత్రమే ఆడి 6 ఫోర్లు 5 సిక్సర్లతో అర్థశతం బాదిన సూర్య మొత్తంగా 68 పరుగులు చేసి 15.4 ఓవర్లోనే మ్యాచ్ ను ఫినిష్ చేయటంతో పాటు ముంబై ఇండియన్స్ కి 9వికెట్ల భారీ విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ముంబై 6వ స్థానికి ఎగబాకితే..చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓటములతో ఆఖరి స్థానంలోనే హ్యాపీగా సెటిల్ అయ్యింది.





















