CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
Tirumala News | ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఒకరోజు అన్న ప్రసాదాలకు రూ.44 లక్షలు విరాళంగా అందించారు.

Happy Birthday Chandrababu | తిరుమల: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అన్న ప్రసాదాల కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా కుటుంబసభ్యులు తిరుమలలో ఒక్కరోజు అన్న ప్రసాదాలకు రూ.44 లక్షల రూపామలు విరాళం ఇచ్చారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో చంద్రబాబు ఫ్యామిలీ స్వయంగా భక్తులకు ప్రసాదం వడ్డించారు.






















