Akhanda 2 Ticket Rates Hike : 'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
Akhanda 2 Premiere Shows : తెలంగాణలోనూ 'అఖండ 2' టికెట్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటే ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Balakrishna's Akhanda 2 Ticket Rates Hike In Telangana : తెలంగాణలోనూ గాడ్ ఆఫ్ మాసెస్ 'అఖండ 2' టికెట్ రేట్స్‌ను ప్రభుత్వం పెంచింది. ధరల పెంపుతో పాటే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏపీలో 10 రోజులు పెంపు వర్తించనుండగా తెలంగాణలో మాత్రం కేవలం 3 రోజులే ఈ పెంపు వర్తించనుంది.
టికెట్ రేట్స్ ఎంతంటే?
'అఖండ 2' సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీ ప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, గురువారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రీమియర్ షో ధర రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక ఈ నెల 7 వరకూ మాత్రమే టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. ఆ తర్వాత యథావిధిగా టికెట్ రేట్స్ ఉండనున్నాయి.
Also Read : 'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్
ఏపీలో టికెట్ రేట్స్ ఇలా...
అటు, ఏపీలో ముందే టికెట్ రేట్స్ భారీగా పెరిగాయ్. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల వరకూ అవే ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.75, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100 వరకూ ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్‌పై అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గురువారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ప్రీమియర్స్ వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ రేట్ రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమయర్స్‌కు అనుమతి లభించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీ
మరోవైపు, మూవీ రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీ నెలకొంది. సినిమా విడుదలపై తమిళనాడులోని మద్రాస్ హైకోర్ట్ స్టే ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. 'అఖండ 2' నిర్మించిన 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమకు రూ.28 కోట్లు ఇవ్వాలంటూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. నిర్మాతలు రామ్ అచంట, గోపీ అచంట 14 రీల్స్ నుంచి 14 రీల్స్ ప్లస్ స్థాపించారని ఆ తర్వాత 'అఖండ 2' నిర్మించారని కోర్టుకు తెలిపారు.
ఎరోస్, 14 రీల్స్ కలిపి 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలు నిర్మించాయి. ఆ టైంలో జరిగిన ఒప్పందాలు నష్టాలు భర్తీ చేయాలని ఎరోస్ కోర్టుకు వెళ్లగా మూవీ రిలీజ్‌పై స్టే విధించినట్లు తెలుస్తోంది. అయితే, రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని... అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ జరగొచ్చని సినీ వర్గాల సమాచారం.
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతోన్న 'అఖండ 2'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతకు ముందు బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా కూడా అంతే స్థాయిలో ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ట్రైలర్, టీజర్ స్పష్టం చేస్తున్నాయి. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ మరో హైలెట్‌గా నిలవనుంది.





















