PBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP Desam
బెంగుళూరుకు వచ్చి మీరు కొట్టారు. మరి పంజాబ్ కి వచ్చి మేం కొట్టాలి కదా అనుకుందేమో ఆర్సీబీ. పంజాబ్ ను సొంత గడ్డపై ఓడించి 7వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. పంజాబ్ ఓపెనింగ్ ఓకే
పంజాబ్ ముల్లాన్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఇన్నింగ్స్ ను గ్రాండ్ గానే ప్రారంభించారు. ఆర్య 15 బాల్స్ లో 3 ఫోర్లు ఓ సిక్స్ తో 22 పరుగులు చేస్తే...ప్రభ్ సిమ్రన్ 17 బాల్స్ లో 5 ఫోర్లు ఓ సిక్సర్ తో 33 పరుగులు చేశారు. వీరిద్దరూ రెండు ఓవర్ల తేడాలో అవుటవ్వటంతో పంజాబ్ పవర్ ప్లే అయ్యే సరికి 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
2. కుప్ప కూలిన మిడిల్..సోసోగా లోయర్ ఆర్డర్
ఓపెనర్లు ఇద్దరూ అయిన కాసేపటికే ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అయిపోవటంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది పంజాబ్. కీపర్ జోష్ ఇంగ్లీష్ టచ్ లో కనిపించినా నేహాల్ వధీరా, స్టాయినిస్ ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్ 17 బాల్స్ లో 2 ఫోర్లు ఓ సిక్సర్ తో 29 పరుగులు చేస్తే..తర్వాత వచ్చిన శశాంక్ డల్ గా ఆడాడు. 31పరుగులు చేసినా అందుకోసం ఏకంగా 33 బంతులు వృథా చేశాడు శశాంక్ సింగ్. చివర్లో మార్కో యాన్సన్ రెండు సిక్సులు కొట్టడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
3. కృనాల్ - సుయాశ్ భలే
పంజాబ్ ను కట్టడి చేయటంతో ఆర్సీబీ స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ భలే ఫర్ ఫార్మ్ చేశారు. కృనాల్ పాండ్యా ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఇద్దరినీ అవుట్ చేయగా ఇద్దరు ఇచ్చిన క్యాచ్ లను టిమ్ డేవిడే పట్టాడు. సుయాశ్ శర్మ జోష్ ఇంగ్లిస్, స్టాయినిస్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇద్దరూ నాలుగు ఓవర్లలో 25, 26 పరుగులు మాత్రమే ఇచ్చి రన్స్ కంట్రోల్ చేయటంతో పంజాబ్ 157 పరుగులే చేయగలిగింది.
4. పడిక్కల్ ప్రవాహం
ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్క పరుగుకే వెనుదిరిగినా కింగ్ కొహ్లీ తో కలిసి దేవ్ దత్త్ పడిక్కల్ దుమ్మురేపాడు. పరిస్థితులకు తగినట్లుగా ఆడుతూనే చివర్లో గేర్లు మార్చి దుమ్ము రేపాడు. 35 బాల్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన పడిక్కల్ మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పాడు.
5. కింగ్ కొహ్లీ ప్రభంజనం
పడిక్కల్ తో కలిసి ఆర్సీబీని లక్ష్యం దిశగా నడిపించాడు కింగ్ కొహ్లీ. ఓపెనర్ గా బరిలోకి దిగి ఆట చివరి బంతి వరకూ క్రీజులోనే ఉన్నాడు.54 బాల్స్ ఆడి 7 ఫోర్లు 1 సిక్స్ తో 73 పరుగులు చేసిన కొహ్లీ తనదైన స్టైల్ లో ఆడి ఆర్సీబీ కి ఐదో విజయాన్ని అందించాడు కొహ్లీ. ఆర్సీబీ ఈ మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకోవటంతో పాయింట్స్ టేబుల్ లో ఐదు విజయాలతో మూడో స్థానానికి ఎగబాకితే..ఈ మ్యాచ్ ఓడిన పంజాబ్ నాలుగో స్థానానికి దిగింది.





















