Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
Vizag : విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.

Center Announces 11440 Crore Bail Out Package To Vizag Steel Plant: ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పునరుజ్జీవ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. మొత్తంగా రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట రూ. 17వేల కోట్లన్న ప్రచారం జరిగింది. తర్వాత రూ. 10330 కోట్లు అని చెప్పుకున్నారు. అయితే అధికారికంగా 11,440 కోట్ల రూపాయలను కేంద్రం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించింది.
Today is a momentous occasion as we celebrate the revival of the Vizag Steel Plant with a ₹11,500 crore package! This isn’t just an economic decision; it’s a victory for our workers, a symbol of our pride, and a testament to the power of perseverance and commitment.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) January 17, 2025
I extend my… pic.twitter.com/saOplcvLeK
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

