Pawan Kalyan: ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,అటవీశాఖల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై విచారణలు 3 వారాల్లో తేల్చాయాలని ఆదేశించారు పవన్. జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP DCM Pawan Kalyan Serious: ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వారికి మంచి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా...కొందరు అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడటం లేదని...గత ప్రభుత్వ వాసనలు ఇంకా వదలడం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pavan Kalyan) మండిపడ్డారు. ఇక ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన శాఖాపరమైన విచారణలు, విజిలెన్స్(Vigilance) విచారణలు ఏళ్లతరబడి సాగుతుండటం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై సున్నితమైన విజిలెన్స్ ఉండాలని...వారిని ఓ కంట కనిపెడుతున్నామన్న చిన్న భయం ఉండాలని అప్పుడే వారు అప్రమత్తంగా ఉంటారని...అత్యుత్తమంగా పనిచేస్తారని డిప్యూటీ సీఎం (Deputy CM)పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పంచాయతీరాజ్(Panchayatraj), గ్రామీణాభివృద్ధి( Rural Development), అటవీశాఖ(Forest Department)లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండటానికి కారణాలు ఎంటి..? ఏయే కేసులు ఎన్నెన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలు సిద్ధం చేయాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను పవన్ ఆదేశించారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని డెడ్‌లైన్ విధించారు.
ఉద్యోగుల నిజాయితీ, పనితీరు, నిబద్ధతకు విజిలెన్స్ నిఘా అనేది ఓ సూక్ష్మదర్శినిలా పనిచేస్తుందన్న పవన్(Pawan Kalyan)...ఏళ్లతరబడి ఈ కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల అది ఉద్యోగుల పనితీరుపైనా ప్రభావం చూపుతుందన్నారు. తప్పు చేసినా ఏం కాదులే అన్న దీమా వస్తుందని ఆయన హెచ్చరించారు. తప్పులు చేస్తున్న అధికారులకు,నిజాయితీగా పనిచేస్తున్న వారికి తేడా లేకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు నిజాయితీగా పనిచేస్తున్న వారిలో కూడా సహనం నశించి తప్పులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి తప్పులు చేసిన అధికారులు, సిబ్బంది తప్పకుండా శాఖాపరమైన విచారణ ఎదుర్కొని శిక్షపడాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయా శాఖల్లో క్రమశిక్షణా చర్యలు, శాఖాపరమైన విచారణలకు సంబంధించి ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉండటానికి కారణాలు ఏంటని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
మొత్తం వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం ఆయన దృష్టికి వచ్చింది. ఈ కేసులు అపరిష్కృతంగా ఉండటం వల్ల అధికారులు, సిబ్బంది,ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపిస్తుందన్నారు. ఒకవేళ ఉద్యోగుల తప్పు ఏమీ లేకపోయినా కేసులు నమోదై..అవి పెండింగ్‌లోనే ఉంటే ఉద్యోగ విరమణ తర్వాత పొందే బెనిఫిట్స్ అన్నీ కోల్పోతారని ఆయన అన్నారు. మరికొందరు ఈ కేసుల విచారణ కారణంగా వారి వృత్తి జీవితంలో పదోన్నతలు పొందలేరని...అన్ని అర్హతలు ఉండి కూడా పెండింగ్ కేసుల మూలంగా వారు అత్యున్నత స్థాయికి చేరకుండానే పదవీవిరమణ పొందుతారని అన్నారు. ఆ తర్వాత వాళ్ల తప్పు ఏం లేదని తేల్చినా ఉపయోగం ఉండదన్నారు. వారు జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సి వస్తుందన్నారు.
మూడు శాఖల్లో పెండింగ్ కేసులపై నివేదికలను మూడు వారాల్లో అందజేయాలని పవన్ కల్యాణ్ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. అభియోగాలు ఎదుర్కొంటన్న వారిపై విచారణ ప్రారంభించినప్పుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటంలేదని...అందుకే విచారణలో జాప్యం జరుగుతోందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అందుకు తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు సూచించారు. ఇకపై అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే...ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు. బలమైన సాక్ష్యాలు సేకరించాలన్న పవన్....విచారణాధికారి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబధాలు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. సక్రమైన రీతిలో విచారణ జరిగి వేగంగా వాటిని పరిష్కరించేలా శాఖాధిపతులు దృష్టిసారించాలని పవన్‌కల్యాణ్ సూచించారు.
Also Read: ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

