Software Jobs: ఫ్రెషర్లకు పండగే.. 42 వేల సాఫ్ట్‌వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం, పెండింగ్‌లో వేతనాల పెంపు
Tata Consultancy Services | ఫ్రెషర్లకు పండగే.. 42 వేల సాఫ్ట్‌వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం తీసుకుంది. యంగ్ టాలెంట్‌కు అవకాశం ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భావిస్తోంది.

IT Fresher Jobs 2025 | ఐటీ దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఏకంగా 42,000 మంది ఫ్రెషర్లకు టీసీఎస్ ఉద్యోగాలు ఇవ్వనుంది. అమెరికా టారిఫ్‌ల భయం, మార్కెట్ అనిశ్చితి కారణంగా వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లపై మాత్రం సంస్థ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
వరుసగా రెండో ఏడాది భారీగా నియామకాలకు నిర్ణయం
ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం TCS ఉద్యోగుల సంఖ్య 6,07,979గా ఉంది. నాల్గవ త్రైమాసికంలో 625 మంది కొత్తగా ఉద్యోగులను నియమించింది. ఈ ఏడాది, టీసీఎస్ ఏకంగా 42000 మంది సాఫ్ట్‌వేర్ ఫ్రెషర్లను నియమించుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ అదే సంఖ్యలో ఫ్రెషర్లకు సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. TCS చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ.. "2025 ఆర్థిక సంవత్సరంలో 42,000 మంది ట్రైనీలను జాయిన్ చేసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో సైతం ఇంతకంటే ఎక్కువగా నియామకాలు చేపట్టనున్నాం. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, మార్కెట్ అనిశ్చితి కారణంగా వేతన పెంపుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం" అన్నారు.
క్యాంపస్ సెలక్షన్లతో పాటు ఇతర నియామకాల ద్వారా స్కిల్ సెట్ ఆధారంగా ఫ్రెషర్లకు అవకాశం కల్పించామని తెలిపారు.
యంగ్ టాలెంట్ కోసం టీసీఎస్ అన్వేషణ
టీసీఎస్ కొత్త సాంకేతికత కోసం యంగ్ టాలెంట్‌ను నియమించుకోవాలని, అంతర్జాతీయంగా ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజులలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద వర్క్ కనుక ఎక్కువ మంది ఇంజినీర్లు అవసరం. కనుక భారీగా నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. TCS సంస్థ నాల్గవ త్రైమాసికంలో అట్రిషన్ రేటు గత త్రైమాసికంలో 13 శాతం నుంచి 13.3 శాతానికి పెరిగింది. అయితే గత ఏడాదికి త్రైమాసిక అట్రిషన్ రేటు 130 బేసిస్ పాయింట్లు తగ్గింది. అయితే అట్రిషన్ రేటులో మార్పుతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీసీఎస్ యాజమాన్యం పేర్కొంది.
టారిఫ్‌లతో ఐటీ రంగంపై ప్రభావం..
మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సంస్థ గురువారం నాడు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్ వల్ల ఏర్పడిన అనిశ్చితి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. పలు దేశాల మధ్య ఇది వివాదానికి దారి తీస్తోంది. అయితే పలు దేశాలు డొనాల్డ్ ట్రంప్‌ను రిక్వెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతానికి టారిఫ్ వార్‌కు బ్రేక్ ఇచ్చారు. 90 రోజుల తరువాత టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. ఈ కారణాలతో వేతన పెంపుపై టీసీఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమెరికా విధించే టారిఫ్‌లు ఐటీ రంగంపై సైతం తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
అమెరికా సుంకాల ప్రభావంతో కొన్ని ప్రాజెక్టులను చేపట్టడంలో జాప్యం జరిగింది. అయినా ప్రస్తుత ఆర్డర్ బుక్ పరిశీలిస్తే క్యాలెండర్ ఇయర్ 25 గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుందని టీసీఎస్ యాజమాన్యం భావిస్తున్నట్లు సీహెచ్‌ఆర్వో తెలిపారు. అమెరికా, చైనాల మధ్య మాత్రం టారిఫ్ వార్ కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు ప్రభావం చూపనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

