RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam
ఈ ఐపీఎల్ లో ఓటమి ఎరుగని టీమ్ అంటే కనిపిస్తున్న ఏకైక జట్టు తెలుగు క్యాపిటల్స్ సారీ ఢిల్లీ క్యాపిటల్స్. మరి అలాంటి ఢిల్లీక్యాపిటల్స్ కి బీభత్సమైన ఫామ్ లో ఆర్సీబీతో మ్యాచ్ అది కూడా వాళ్ల హౌం గ్రౌండ్ బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం అంటే ఏ రేంజ్ లో టెన్షన్ ఉంటుంది. కొదమ సింహాలు రెండు ఢీకొట్టుకున్నట్లు అనిపించింది. అయితే KR రాహుల్ సంభవంతో ఆర్సీబీ కి షాక్ పడి ఢిల్లీ వరుసగా నాలుగో విజయంతో మురిసిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. RCB అద్భుత ఆరంభం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మనమేమన్నా తప్పు చేశామా అని ఫీల్ అయ్యి ఉంటుంది కచ్చితంగా. ఎందుకంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ ను అలా ప్రారంభించింది. ప్రత్యేకించి ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు. కేవలం17 బాల్స్ లోనే నాలుగు ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు సాల్ట్. సాల్ట్ బాదుడుకు 3.5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది ఆర్సీబీ. సరిగ్గా అక్కడే సాల్ట్ రన్ అవుట్ ఆర్సీబీని చావు దెబ్బ తీసింది.
2. కింగ్ నుంచి క్యూలైన్
ఆ తర్వాత ఒక్క ఆర్సీబీ కూడా కనీసం ముఫై పరుగులు చేయలేకపోయాడు. కొహ్లీ 22 పరుగులు చేసి విప్రాజ్ నిగమ్ కి అవుట్ అయితే...పడిక్కల్ 1 పరుగుకే వికెట్ ఇచ్చుకున్నాడు. పటీ దార్ పాతిక పరుగులకు దుకాణం సర్దేశాడు. లివింగ్ స్టోన్, జితశ్ శర్మ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు ఢిల్లీ బౌలర్లను. చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లోనే 4 సిక్సర్లు 2 ఫోర్లతో 37పరుగులు చేయకపోతే ఆర్సీబీ కనీసం 150 పరుగులు కూడా దాటేది కాదేమో.
3. స్పిన్ ఉచ్చు
ఆర్సీబిని కట్టడి చేయటంలో కీలకపాత్ర పోషించింది స్పిన్ బౌలింగ్. ప్రధానంగా కుర్రోడు విప్రాజ్ నిగమ్ అద్భుతంగా బౌలింగ్ ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. ప్రమాదకర ఆటగాడిగా మారుతున్న సాల్ట్ ను రనౌట్ చేసి విప్రాజ్ తర్వాత బౌలింగ్ తీసుకుని కింగ్ కొహ్లీని అవుట్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి కృనాల్ వికెట్ కూడా తీయటంతో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరో వైపు కుల్దీప్ కూడా అంతే. పరుగులను పూర్తి సీజ్ చేశాడు. 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి పటీదార్, జితేశ్ వికెట్లు తీసుకుని రెండు వికెట్ల ఖాతాలో వేసుకుని ఆర్సీబిని అడ్డుకోవటంతో ఆ టీమ్ కేవలం 164పరుగులు మాత్రమే టార్గెట్ ఇవ్వగలిగింది.
4. ఢిల్లీ పేలవ ఆరంభం
164 పరుగులే కదా టార్గెట్ ఢిల్లీకి ఉన్న బ్యాటింగ్ లైనప్ కి ఈజీలే అనుకుంటే ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో బాల్ ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఢిల్లీ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. జేక్ ఫ్రేసర్ ను 7 పరుగులు, అభిషేక్ పోరల్ ను 7 పరుగులకు అవుట్ చేశాడు భువీ. యశ్ దయాల్ ఫాఫ్ డుప్లెసీ వికెట్ తీసుకోవటంతో ఢిల్లీ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిది. తర్వాత అక్షర్ కూడా 15 పరుగులకే అవుటవ్వటంతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.
5. స్టబ్స్ తోడుగా KL సంభవం
ఈ మ్యాచ్ నిజంగా కేఎల్ రాహుల్ సంభవం అని చెప్పాలి. బ్రూటల్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగి...రుద్రతాండవమే ఆడాడు. క్లాసిక్ షాట్స్, అండర్ ప్రెజర్ లో అద్భుతమైన ఆటతీరుతో 53 బంతుల్లో 7ఫోర్లు 6 సిక్సర్లతో 93పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కేఎల్ రాహుల్. మరో వైపు స్టబ్స్ కూడా అద్భుతమైన సహకారంతో పాటు చివర్లో బ్యాట్ ఝళిపించాడు. 23 బాల్స్ లోనే 38 పరుగులు చేయటంతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో నాలుగో విజయం సాధించి ఓన్లీ అన్ బీటెన్ టీమ్ గా నిలబడింది





















