New Aadhaar QR Code App: ఆధార్ కార్డు QR కోడ్ యాప్ వచ్చేసింది, షేర్ చేయడం మరింత సురక్షిత, సులభం!
New Aadhaar QR Code App: ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని మరింతగా కంట్రోల్ చేసేందుకు కేంద్రం కొత్త యాప్ తీసుకొచ్చింది. ఇందులో ఉండే QR కోడ్ యాప్‌తో మీ వివరాలు షేర్ చేయవచ్చు.

New Aadhaar QR Code App: ఆధార్ కార్డు లేని ఇప్పుడు దేశంలో చాలా పనులు పూర్తి కావు. అందుకే సాధారణంగా వినియోగించే డాక్యుమెంట్స్‌లో ఇది ఒకటిగా మారిపోయింది. దేశంలో దాదాపు 90 శాతం మందికిపైగా ఆధార్ కార్డులు ఉన్నాయి. రోజువారీగా ప్రయాణం చేసే మహిళలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి విద్యార్థులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందే ప్రజలకు ఈ ఆధార్ కార్డు అవసరం అవుతుంది.
ఆధార్ ఆధారపడి చాలా పనులు జరుగుతున్న ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఎవరు ఎలా వాడుకుంటారో తెలియదు. అందుకే దీని నుంచి విముక్తి పొందేందుకు ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ ప్రారంభించింది. ఇందులో QR కోడ్ సహాయంతో మీ అన్ని పనులు జరుగుతాయి. ఇక మీరు మీతో ఆధార్ కార్డును తీసుకెళ్లనవసరం లేదు, ఆధార్ కార్డు కాపీని కూడా తీసుకెళ్లనవసరం లేదు.
QR కోడ్ ద్వారా పని జరుగుతుంది
మీరు ఎక్కడికైనా వెళితే, మీ ఐడెంటీ కోసం ఆధార్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇకపై మీఆధార్ కార్డు చూపించనవసరం లేదు, ఆధార్ కార్డు కాపీ కూడా అవసరం లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లో ఉన్న QR కోడ్ సహాయంతో మీ ఐడెంటీని నిరూపించుకోవచ్చు. అంటే మీరు ఫోన్‌లో ఈ యాప్‌ను తెరిచి QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీ సమాచారం సంబంధిత విభాగానికి పంపిస్తుంది. దీని ద్వారా మీరు ఆధార్ కార్డు కాపీని సమర్పించకుండానే మీ పని పూర్తి చేసుకోవచ్చు.
యాప్ ఎలా పనిచేస్తుంది
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్ ద్వారా ఈ సమాచారం అందజేశారు. కొత్త యాప్‌తో మీరు మీతో ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఫోటో కాపీని కూడా తీసుకెళ్లనవసరం లేదు అని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ చాలా వేగంగా జరుగుతుంది. సురక్షితంగా కూడా ఉంటుందని యాప్‌లో ఫేస్ ID ఆప్షన్ ద్వారా మీ గుర్తింపును నిరూపించుకోవచ్చు.
యూపీఐ యాప్‌లు ఎలా పనిచేస్తాయో తెలిసిందే కదా. అంటే యూపీఐ చెల్లింపు చేయాల్సి వచ్చినప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బులు పంపుతారు. అలాగే మీరు ఆధార్ కార్డు సమాచారాన్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు... యాప్‌తో QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫేస్ ID ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో మీకు ఇంకో సౌకర్యం కూడా ఉంది. మీరు ఎంత సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నారో అంతే షేర్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఆధార్ కార్డు వినియోగదారుల గోప్యత సురక్షితంగా ఉంటుంది.
New Aadhaar App
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Face ID authentication via mobile app
❌ No physical card
❌ No photocopies
🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
త్వరలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది
భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. కానీ త్వరలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X అధికారిక ఖాతాలో దీని డెమో వీడియో పోస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి తన ఫోన్‌తో యాప్ ద్వారా QR కోడ్‌ను ఎలా స్కాన్ చేస్తున్నాడో, ఆ తర్వాత ఫేస్ ID ధృవీకరణను ఎలా చేస్తున్నాడో చూపించారు. ఆ తర్వాత అతని ఆధార్ ధృవీకరణ పూర్తి అవుతుంది.





















