search
×

Loan on Aadhar Card: ఆధార్ కార్డ్ ఉంటే రూ.80,000 బ్యాంక్‌ లోన్‌ - గ్యారెంటీ చూపాల్సిన అవసరం లేదు

PM Svanidhi Yojana: ఈ పథకాన్ని గతంలో వీధి వ్యాపారుల కోసం మాత్రమే ప్రారంభించారు. ఇప్పుడు, వీధి వ్యాపారాలు నిర్వహించే అన్ని రకాల విక్రేతలు దీని పరిధిలోకి వస్తారు.

FOLLOW US: 
Share:

Pradhan Mantri Svanidhi Yojana Loan: పేదలు, అల్ప ఆదాయ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకి రుణాలు అందించే స్కీమ్‌లు కూడా వాటిలో ఉన్నాయి. అర్హత ఉన్న వ్యక్తులు తమ ఉపాధిని పెంచుకోవడానికి లేదా కొత్తగా ప్రారంభించడానికి ఈ పథకాల ద్వారా లోన్‌ తీసుకోవచ్చు. అలాంటి పథకాల్లో "ప్రధాన మంత్రి స్వనిధి యోజన" లేదా "పీఎం స్వనిధి యోజన" ఒకటి. దీని ద్వారా, కేవలం ఆధార్ కార్డు ద్వారానే రూ. 80 వేల వరకు రుణం లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం స్వనిధి యోజన గురించి ప్రధాని మోదీ స్వయంగా చాలాసార్లు ప్రస్తావించారు. ఈ పథకం ఉద్దేశ్యం వీధి వ్యాపారాలు & చిన్న వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం. 

పీఎం స్వనిధి యోజనను, తొలుత, వీధి వ్యాపారుల కోసం మాత్రమే ప్రారంభించారు. తర్వాత, ఈ పథకం పరిధిని విస్తరించారు. ఇప్పుడు, కూరగాయల నుంచి పండ్ల వరకు అన్ని రకాల వీధి వ్యాపారాలు నడుపుతున్న వ్యక్తులు ఈ స్కీమ్‌ కిందకు వస్తారు. 

రూ.80,000 వరకు లోన్‌
ఈ స్కీమ్ కింద, కేవలం మీ ఆధార్ కార్డును చూపించి తక్షణం రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద, వీధి వ్యాపారులకు మూడు దశల్లో రుణం అందిస్తారు. మొదటిసారి రూ.10 వేలు రుణం ఇస్తారు. దానిని సక్రమంగా తిరిగి చెల్లించిన తర్వాత రూ.20 వేల వరకు రుణం ఇస్తారు. దీనిని కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన రూ. 50,000 వరకు రుణం మంజూరు చేస్తారు. మొత్తంగా రూ.80,000 వరకు లోన్‌ పొందొచ్చు. 

ఈ 3 దశల్లో లోన్‌ తీసుకోవడానికి మీరు ఎలాంటి గ్యారెంటీ చూపించాల్సిన అవసరం లేదు, ఆధార్‌ కార్డ్‌ మాత్రం ఉంటే చాలు. మరో విశేషం ఏంటంటే, ఈ పథకంలో ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. వీధి వ్యాపారులు తీసుకున్న రుణాలను చాలా తక్కువ వడ్డీ రేట్లతో, సులభమైన వాయిదాలతో తిరిగి చెల్లించవచ్చు. 

ఏడాదికి రూ.1200 క్యాష్‌బ్యాక్
ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద 7% వడ్డీ రాయితీ కూడా ఇస్తారు. ఇది కాకుండా, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, ఏటా రూ.1200 క్యాష్ బ్యాక్ అందిస్తారు. 

ఎవరు అర్హులు?
వీధి వ్యాపారులు పీఎం స్వనిధి యోజన పథకం కింద లోన్‌ పొందడానికి అర్హులు. మొదటిసారి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తులకు పీఎం స్వనిధి యోజన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారి వర్కింగ్ క్యాపిటల్‌ అవసరాలను ఇది తీరుస్తుంది.

రుణం ఎలా పొందాలి, ఏయే పత్రాలు కావాలి?
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లవచ్చు. ఇక్కడ మీకు ఒక ఫారం ఇస్తారు, దానిలో మీ సమాచారాన్ని పూరించాలి. ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నారో చెప్పాలి. మీ వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా నంబర్ ఉండాలి. ధృవీకరణ తర్వాత లోన్ డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. 

పీఎం స్వనిధి యోజన కోసం ఆన్‌లైన్‌ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం: 'సిస్టమాటిక్‌ విత్‌డ్రా ప్లాన్‌'తో పెన్షన్ తరహా బెనిఫిట్స్‌ - తెలివైన రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌! 

Published at : 30 Dec 2024 09:33 AM (IST) Tags: Loan Scheme PM Svanidhi Yojana Street Vendor Government Loan Loan on Aadhar card

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

టాప్ స్టోరీస్

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy