Box Office Queen: రెండేళ్లలో రూ. 3160 కోట్ల కలెక్షన్లు రాబట్టిన బాక్సాఫీస్ క్వీన్ ఈ సౌత్ హీరోయిన్... స్టార్ హీరోతో లవ్ రూమర్స్... వివాదాల్లోనూ..
South Heroine : ఈ హీరోయిన్ రెండేళ్లలో రూ.3,160 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ క్వీన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. స్టార్ హీరోతో లవ్ రూమర్స్‌తో వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తారు, వెళ్తారు. కొందరైతే ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో కష్టపడ్డప్పటికీ గుర్తింపు మాత్రం దక్కదు. అతి కొద్ది మంది మాత్రమే స్టార్ట్ డమ్‌కు గోల్డెన్ టికెట్ సంపాదించి, అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకుంటారు. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ క్వీన్‌గా మారతారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషయంలోనూ ఇదే జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అతి తక్కువ కాలంలోనే వరుస బ్లాక్ బస్టర్లతో ఈ బ్యూటీ దీపికా పదుకొనే వంటి అగ్రతారలను కూడా వెనక్కి నెట్టింది.
రెండేళ్లలోనే రూ.3,600 కోట్ల వసూళ్లు
ఇక గత రెండేళ్లుగా రష్మిక మందన్న చేసిన సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఈ కనక వర్షం రెండేళ్ల క్రితం 'యానిమల్' మూవీ భారీ విజయంతో మొదలైంది. అంతకు ముందు ఆమె నటించిన సినిమాలకు చాలా వరకు హిట్ అయినప్పటికీ ఈ 3,000 కోట్ల రికార్డు మాత్రం గత రెండేళ్లదే. 'యానిమల్' మూవీని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 901 కోట్లు వసూలు చేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన మరో పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' కూడా అదే జోష్ కొనసాగించింది. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏకంగా 1800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి, రష్మిక కెరియర్‌లోనే ఓ మైలురాయిగా మారింది.
ఇక ఆ తర్వాత ఆమె విక్కీ కౌశల్ సరసన నటించిన హిస్టారికల్ మూవీ 'ఛావా' నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఏకంగా 805 కోట్లు రాబట్టింది. తాజాగా సల్మాన్ ఖాన్‌తో కలిసి రష్మిక మందన్న నటించిన 'సికందర్' మూవీ 200 కోట్లు కొల్లగొట్టింది. నిజానికి 'సికందర్' మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ మూవీ 200 కోట్ల మార్క్ క్రాస్ చేయడం విశేషం. ఇక గత రెండేళ్లలో రిలీజ్ అయిన రష్మిక సినిమాల కలెక్షన్లన్నీ కలిపి చూస్తే మొత్తంగా రూ.3,610 కోట్లకు పైగా వసూలు చేసినట్టే లెక్క.
స్టార్ హీరోతో ప్రేమలో, వివాదాలు
ఇక రష్మిక మందన్నకి ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ కొన్నిసార్లు వివాదాలను కూడా తెచ్చి పెట్టింది. కన్నడ ఇండస్ట్రి తరచుగా రష్మికపై కన్నెర్ర చేస్తూ ఉంటుంది. 'కాంతారా' సినిమాపై ఆమె చేసిన కామెంట్స్ నుంచి రీసెంట్‌గా తన ఇల్లు హైదరాబాద్ అని రష్మిక చేసిన కామెంట్స్, కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పిలిచినా ఆమె రాలేదని కర్ణాటక ఎమ్మెల్యే ఫైర్ కావడం వరకు రష్మిక చాలా వివాదాలనే ఫేస్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే పుకార్లు నిత్యం షికార్లు చేస్తూనే ఉంటాయి.





















