SSMB29 : అభిమానుల కోసం మహేష్ బాబు సెన్సేషనల్ డెసిషన్... డబుల్ ధమాకా ట్రీట్ లోడింగ్
SSMB 29 : జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎస్ఎస్ఎంబి 29' కోసం మహేష్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఆయన పిల్లలు సితార, గౌతమ్ కీ రోల్స్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

Mahesh Babu Sensational Decision On SSMB29 Movie: 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే జక్కన్న రూపొందిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీతో మహేష్ బాబు ప్రపంచ స్థాయిలో సినీ ప్రపంచానికి తన పిల్లల్ని పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
'ఎస్ఎస్ఎంబి 29'లో డబుల్ ధమాకా ట్రీట్
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఫస్ట్ మూవీ 'ఎస్ఎస్ఎంబి 29'. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, ఒడిస్సాలో ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే మేకర్స్ పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లోనే జరగబోతోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీతో మహేష్ బాబు తన ఇద్దరు పిల్లల్ని లాంచ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
'ఎస్ఎస్ఎంబి 29' మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇక ఇందులో మహాభారతం, రామాయణాలను కూడా ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్‌లు పవర్ ఫుల్ రోల్స్ పోషించబోతున్నారని సమాచారం. జక్కన్న లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీనే తన పిల్లలను వెండితెరపై పరిచయం చేయడానికి బెస్ట్ అని, ఇదే సితార, గౌతమ్‌ల లాంచ్‌కు సరైన సమయమని మహేష్ భావిస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సితార, గౌతమ్ ఇద్దరూ ఈ మూవీతోనే లాంచ్ అవ్వడం అన్నది సూపర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అవుతుంది.
గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గతంలోనే... సితార కోసమే వెయిటింగ్
ఇదిలా ఉండగా గౌతమ్ ఘట్టమనేని ఇప్పటికే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు హీరోగా నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాలో ఆయన చిన్నప్పటి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూనే, యాక్టింగ్‌పై ఫోకస్ చేశాడు. ఇటీవల ఆయన నటించిన ఓ డ్రామాకు సంబంధించిన షార్ట్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జక్కన్న సినిమాతో లాంచ్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇప్పటిదాకా ఇతర స్టార్ కిడ్స్ ఎవరికీ దక్కని అరుదైన అవకాశం మహేష్ కిడ్స్‌కు దక్కినట్టే. మరోవైపు సితార వరుసగా బ్రాండ్ ఎండార్స్మెంట్లతో తన ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్న అభిమానులను ఊరిస్తోంది. ఆమె మూవీ ఎంట్రీని కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకుంటారు.





















