NTR Neel Movie Update: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగు పెట్టబోయేది ఎప్పుడంటే?
NTR Neel Movie Update : యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు అన్న విషయాన్ని అధికారికంగా స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లో ఎప్పుడు అడుగు పెడతారు అన్న విషయాన్ని డేట్ తో సహా స్పెషల్ పోస్టర్ ద్వారా నిర్మాతలు వెల్లడించారు. ఆ అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లోకి ఏప్రిల్ లోనే ఇవ్వనున్నారు.
'డ్రాగన్' నుంచి ఊహించని అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ - మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ 'ఎన్టీఆర్ - నీల్'కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించినప్పటి నుంచి అందరి కళ్ళూ ఈ సినిమాపైనే ఉన్నాయి. అసలు ఏ అప్డేట్ ఇవ్వబోతున్నారు ? అనే విషయమై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేకుండానే ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం 'వార్ 2' సినిమా షూటింగ్, మరోవైపు 'దేవర' జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ అంటూ ఇంకా సెట్లోకి అడుగు పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాసేపటికి క్రితమే ఈ విషయమై నిర్మాతల నుంచి అప్డేట్ రాగా, తెగ వైరల్ అవుతుంది.
#NTRNeel is entering its most explosive phase 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2025
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️🔥❤️🔥#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm pic.twitter.com/z7hsCkhOY0
నిజానికి ఇది ఊహించని అప్డేట్ అనే చెప్పాలి. 'డ్రాగన్' మూవీని జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకు అనౌన్స్ చేశారు. కానీ 'జననాయగన్' మూవీతో క్లాష్ కారణంగా ఈ మూవీ వాయిదా పడబోతుందని, ఏప్రిల్ 9న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుందని టాక్ నడిచింది. ఇప్పుడు అదే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని అన్నారు. కానీ తీరా చూస్తే మేకర్స్ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చి నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
ఆ ఒక్క పని పూర్తయితే సెట్టు
ఇక దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్నారు. 'వార్ 2' షూటింగ్, 'దేవర' జపాన్ ప్రమోషన్స్, ఇండియాకు తిరిగి రాగానే 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్, అనంతరం సుకుమార్ తో మీటింగ్, వంశీ పైడిపల్లి భార్య బర్త్ డే సెలబ్రేషన్స్... ఇలా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక త్వరలోనే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. ఈ ఒక్క పని పూర్తయ్యాక ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.





















