Moringa Leaf Benefits : మునగాకులతో ఈ ఆరోగ్య సమస్యలు దూరం.. ఇలా తీసుకుంటే మంచిది, జాగ్రత్తలివే
Moringa : మునగాకులతో ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. అయితే వీటిని ఎలా డైట్లో తీసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

Moringa Leaves Benefits : మునగకాయలే కాదు.. మునగాకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వాటిని కూరల్లో ఉపయోగిస్తున్నారు. మరికొందరు దీనిని పొడి చేసుకుని కూడా తమ డైట్లో తీసుకుంటారు. వీటిలో 92కు పైగా పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. దీనిని డైట్లో తీసుకుంటే శరీరానికి విటమిన్ ఏ, సి, ఈ కూడా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా శరీరానికి అందుతాయి.
మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలు
కణాలు దెబ్బతినకుండా మునగాకుల్లోని యాంటీఆక్సిడెంట్లు రక్షిస్తాయి. మునగాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల గ్రోత్‌ని కంట్రోల్ చేస్తాయి. క్యాన్సర్ సమస్యలను దూరం చేసుకోవడానికి దీనిని రెగ్యులర్ డైట్లో తీసుకోవచ్చు. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్ వంటి సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేసి.. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచే లక్షణాలు మునగాకుల్లో ఉంటాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మునగాకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మలబద్ధకం, డయోరియా, బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మునగాకుతో బ్యూటీ బెనిఫిట్స్
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. మునగాకులతో చేసిన నూనెను స్కిన్ కేర్, హెయిర్ కేర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మానికి, జుట్టుకు కూడా మంచి పోషణను అందించి మాయిశ్చరైజ్ చేస్తుంది. వయసు పరంగా వచ్చే బ్యూటీ సమస్యలను ఇవి దూరం చేస్తాయి. వీటిని నేరుగా తీసుకున్నా.. స్కిన్ హెల్త్ బాగా ప్రమోట్ అవుతుంది. వయసు పరంగా వచ్చే కంటి సమస్యలను దూరం చేయడంలో ఈ యాంటీఆక్సిడెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మునగాకుతో మరిన్ని ప్రయోజనాలు..
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచే లక్షణాలు మునగాకుల్లో ఉంటాయి. కాబట్టి మధుమేహమున్నవారు వీటిని తమ డైట్లో తీసుకోవచ్చు. బోన్స్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా మంచిది. యాంగ్జైటీ, డిప్రెషన్ సమస్యలను దూరం చేస్తుంది.
మునగాకుల్లో విటమిన్ బి, ఐరన్ ఉంటుంది. ఇది మీకు రోజంతా ఎనర్జీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. కెఫిన్ అవసరం మీకు ఉండదు. ఇన్ఫ్లమేషన్ని తగ్గించి.. నొప్పులు లేకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్బ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
డైట్లో ఎలా తీసుకోవచ్చంటే..
మునగాకులను కర్రీగా చేసుకోవచ్చు. లేదంటే పప్పులో వేసుకోవచ్చు. సప్లిమెంట్స్, క్యాప్సుల్ రూపంలో తీసుకోవచ్చు. మునగాకులను పొడిగా చేసుకుని స్మూతీలు, జ్యూస్‌లలో కలిపి తీసుకోవచ్చు. దీనితో చేసిన ఆయిల్‌ని వంటలకు లేదా బ్యూటీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మునగాకులతో టీ పెట్టుకోవచ్చు. లేదా సలాడ్స్‌లో వీటిని చల్లుకుని తినొచ్చు.
మునగాకులు ఆరోగ్యానికి మంచివే అయినా.. వాటిని డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. మీ మెడికల్ కండీషన్, తీసుకునే మందులను బట్టి.. వారు మీకు దీనిని సజెస్ట్ చేస్తారు.






















