Wine Shops In Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో 24 గంటలపాటు వైన్ షాపులు బంద్
Liquor Shops In Hyderabad | మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్‌లో 24 గంటలపాటు వైన్ షాపులు బంద్ ఉంటాయని వెల్లడించారు. హనుమాన్ విజయయాత్ర సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Hanuman Shobha Yatra Hyderabad | హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు పోలీసులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో శనివారం నాడు వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి (Hanuman vijaya yatra) సందర్భంగా నగరంలో ఏప్రిల్ 12 వ తేదీన వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తాజా ప్రకటనతో ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని హైదరాబాద్ సీపీ తెలిపారు.
హైదరాబాద్ పోలీసులు అలర్ట్
శనివారం హనుమాన్ విజయయాత్రకు 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆరోజు రెండో శనివారం కావడంతో సెలవు ఉందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ సైతం ఉంది. దాంతో ఇతర కమిషనరేట్లు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హనుమాన్ విజయయాత్ర నిర్వహణ కారణంగా ఆరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లలో వైన్ షాపులు బంద్ ఉంటాయని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.






















