TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Telangana Indiramma Illu Housing Status Check | తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ చేసుకోవడానికి ఇలా చేయండి. వెబ్‌సైట్ సహా నమోదు చేయాల్సిన వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Indiramma Housing Scheme List 2025: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చనుంది. ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తూ లబ్ధిదారులకు తమ వంతు సహకారం అందిస్తోంది. జనవరి 26న ఇందిరమ్మ ఇల్లు గృహనిర్మాణ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి రూ. 5 లక్షలు కేటాయించి, మొత్తం రూ. 22,000 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హులైన లబ్ధిదారులు తమ వివరాలును చెక్ చేసుకునే వీలు కల్పించారు. indirammaindlu.telangana.gov.in లో మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. మీ స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి, లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్, తొలి దశ నగదు వివరాల అప్‌డేట్ సమాచారం పొందే వీలుంది.
ఇందిరమ్మ ఇల్లు గృహనిర్మాణ పథకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు గృహనిర్మాణ పథకాన్ని మార్చి 11, 2024న ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడం పథకం ఉద్దేశం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో మొత్తం 4.5 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. అందుకుగానూ రూ. 22,000 కోట్ల బడ్జెట్‌ను సర్కార్ కేటాయించింది. ప్రతి లబ్ధిదారునికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది.
అర్హతలు ఏమిటీ..
- లబ్ధి పొందాలనుకునేవారు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- ఇల్లు లేనివారు లేదా తాత్కాలిక, అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారు అయి ఉండాలి.
- ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారికి తొలి ప్రాధాన్యం.
- ప్రభుత్వం నుంచి ఇతర ఏ గృహ పథకాల నుండి ప్రయోజనాలను పొందని వారై ఉండాలి.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- వాడుకలో ఉన్న మొబైల్ నంబర్
- అడ్రస్ ప్రూఫ్
- రేషన్ కార్డ్
- పాన్ కార్డ్
ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
మున్సిపల్ కార్పొరేషన్, గ్రామసభ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ దరఖాస్తు ఫారమ్‌ను పొందాలి. లేకపోతే ప్రజా పాలన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్ నింపాలి
మీ పేరు, కులం, వయస్సు, అడ్రస్, బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు ఫారమ్‌లో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎంచుకోండి.
అవసరమైన పత్రాలను జత చేయండి:
ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలతో అవసరమైన డాక్యుమెంట్స్ దరఖాస్తు ఫారమ్‌కు జతచేయాలి. అప్లికేషన్ ఫారమ్ ను మున్సిపల్ కార్పొరేషన్, గ్రామసభ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో సమర్పించాలి.
ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాని ఎలా చెక్ చేయాలి?
- Indiramma Illu Housing Scheme అధికారిక వెబ్‌సైట్‌ను indirammaindlu.telangana.gov.inకి వెళ్లండి.
- హోం పేజీలో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీ వివరాలు నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్, అప్లికేషన్ నంబర్, ఆధార్ నంబర్ లేక FSC కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు.
- కావాల్సిన సమాచారాన్ని మీరు నమోదు చేయండి. తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
- మీ స్క్రీన్ మీద అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడి స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
- మొదట అధికారిక వెబ్‌సైట్ indirammaindlu.telangana.gov.inను సందర్శించండి
- హోం పేజీలో లబ్ధిదారుడి స్థితి (Beneficiary Status)పై క్లిక్ చేయండి
- అప్లికేషన్ నెంబర్ నమోదు చేయాలి.
- తరువాత సబ్మిట్ క్లిక్ చేయండి. లబ్ధిదారుడి ప్రస్తుత స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

