Viral Video: చిన్నస్వామి స్టేడియం నా అడ్డా.. వైరలవుతున్న రాహుల్ వైల్డ్ సెలెబ్రెషన్స్.. సోషల్ మీడియాలో రచ్చ
KL Rahul News: కేఎల్ రాహుల్ వన్ మేన్ షో చూపించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో భారీ ఫిఫ్టీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ ముగిశాక చిన్నస్వామి తన అడ్డా అని సంకేతాలు పంపాడు..

KL Rahul Wild Celebrations: చిన్నస్వామి స్టేడియంలో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ కేెెెెెెెఎల్ రాహుల్ (53 బంతుల్లో 93, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరోచిత ఫిఫ్టీతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఘన విజయం అందించాడు. దీంతో ఈ సీజన్ లో వరుసగా నాలుగో విజయంతో ఢిల్లీ సత్తా చాటింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఏడు బౌలర్లు, ఆరు సిక్సర్లు కొట్టిన రాహుల్.. తన విలువేంటో చాటి చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ ముగిశాక చిన్నస్వామి స్టేడియం తన అడ్డా అని రాహుల్ చేసిన విన్నింగ్స్ వైల్డ్ సెలెబ్రెషన్ వైరలైంది. నిజానికి కర్ణాటకకి చెందిన రాహుల్ కి ఈ స్టేడియం కొట్టిన పిండి. ఈ క్రమంలో సరైన సమయంలో గేర్లు మార్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అందుకే ఆర్సీబీపై తన జట్టును గెలిపించినా.. తాను కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడినేనని, స్థానిక అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక రాహుల్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
This is my home ground and I'm the king of this arena
— Ambani (@Ambaanii) April 10, 2025
- Sir KL Rahul while receiving POM award.💥pic.twitter.com/okg3hhfVIw
వర్షం వస్తుందని..
ఈ మ్యాచ్ లో రాహుల్ ని తనలోని సమయస్ఫూర్తిని మరోసారి బయట పెట్టాడు. మ్యాచ్ మధ్యలో చినుకులు పడ్డాయి. అప్పటికి 14 ఓవర్ల ఆట ముగిసింది. దీంతో డీఎల్ఎస్ పార్ స్కోర్ కి డీసీ అందనంత దూరంలో ఉంది. దీంతో డీఎల్ ఎస్ ను దృష్టిలో పెట్టుకుని జోష్ హేజిల్ వుడ్ వేసిన 15 వ ఓవర్ ని రాహుల్ టార్గెట్ చేశాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో ఆ ఓవర్ లో 22 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ డీసీ వైపు మొగ్గింది. ఆ తర్వాత వర్షం తగ్గినా మరింత జోరు కొనసాగించిన రాహుల్.. ధాటిగా ఆడి 13 బంతులు మిగిలి ఉండగానే, ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన దశలో తనలోని అనుభవన్నంతా రంగరించి, డీసీకి జట్టుకు రాహుల్ విజయాన్ని అందించాడు.
𝗞𝗟assy. 𝗞𝗟inical. 𝗞𝗟utch 💥
— IndianPremierLeague (@IPL) April 10, 2025
KL Rahul wins the Player of the Match award for guiding #DC home with a stunning 9⃣3⃣* 🙌
Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/PFie6BHeBf
వికెట్ కీపింగ్ తోనే గమనించా..
ఈ మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. తను వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ను గమనించానని, అందుకే బ్యాటింగ్ లో పరిస్థితులకు తగినట్లుగా గేర్లు మారుస్తూ ఆడానని చెప్పుకొచ్చాడు. ఇక చిన్నస్వామి స్టేడియం తనకు చాలా బాగా తెలుసని, ఇక్కడ ఎలా ఆడాలో బాగా ఐడియా ఉందని పేర్కొన్నాడు. ఇక తను ఏ మ్యాచ్ లో ఆడిన ఆ పిచ్ కు తగినట్లుగా షాట్ల ఎంపిక ఉంటుందని గుర్తు చేశాడు. మ్యాచ్ లో జట్టు పరిస్థితిని బట్టి సింగిల్స్ తీయడంతో స్ట్రైక్ రొటేట్ చేయడంతోపాటు అవసరమైన షాట్లు ఆడతాడనని చెప్పుకొచ్చాడు. మరోవైపు గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్.. ఈ సీజన్ నుంచి ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ వరుసగా నాలుగో విజయం సాధించడం పట్ల ఆ జట్టు అభిమానులు, యాజమాన్యం ఫుల్ హేపీగా ఉంది.




















