Patanjali Project in Madhya Pradesh: బీడు భూముల్లో సిరుల సాగుకు పూనుకున్న పతంజలి.. మధ్యప్రదేశ్‌లో సమగ్ర సాగు
పంటలు పండక బీడుబారిన భూములను సారవంతంగా మార్చేందుకు పతంజలి యోగపీఠం పూనుకుంది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌లో స్థిరమైన వ్యవసాయ విధానాల ద్వారా అక్కడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిర్ణయించుకుంది

మధ్యప్రదేశ్‌లోని బీడు భూములకు మంచి రోజులు వస్తున్నాయి. పంటలు పండటం కష్టమై రైతులకు ఓ ఆశాదీపం కనిపిస్తోంది. వాణిజ్య పంటల సాగు ద్వారా రైతుల జీవితాలను మార్చే ప్రణాళికలకు పతంజలి యోగ పీఠం పూనుకుంది. మధ్యప్రదేశ్‌లోని Maugunj జిల్లాలో వ్యవసాయ యోగ్యం కానీ వేలాది ఎకరాల భూమిలో అక్కడ పండగలిగే పంటలకు అవకాశం కల్పిస్తోంది పతంజలి యోగపీఠం. ఈ ప్రాంతంలోని రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వింధ్య ప్రాంతంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని చెబుతోంది పతంజలి.
పతంజలి ప్రారంభించబోయే ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి కీలక ముందడుగు పడంది. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్ల పతంజలి యోగపీఠం ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణకు అధికారికంగా భూమిని బదలాయించారు.
రైతుల కలలను నెరవేర్చుతాం- Acharya Balkrishna:
భూమికి సంబంధించిన లావాదేవీలు పూర్తయిన తర్వాత ఆచార్య బాలకృష్ణ మధ్యప్రదేశ్‌లో సైట్‌ను పరిశీలించారు. ఆ ప్రాంతంలో తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటించారు. పతంజలి యోగపీఠం వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రైతుల స్థితిగతులను మెరుగుపరిచే కార్యక్రమానికి పూనుకున్నారని అందులో భాగంగానే పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాము చేపట్టబోయే కార్యక్రమాలతో రైతుల ఆదాయం మెరుగవ్వడంతో పాటు.. వింధ్య ప్రాంతంలో పరిస్థితులు మొత్తం మారిపోతాయన్నారు.
పతంజలి, Mauganj జిల్లారోని గుర్హెటా Ghurehta గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పటు చేయనుంది. స్థానిక వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడంతోపాటు.. స్థానికులకు ఉపాథి కల్పన, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడం అనే లక్ష్యాలతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కుతో పాటు స్థానికి ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
స్థిరమైన సాగు- అధునాతన పద్దతులకు ప్రాధాన్యం.
ఈ ప్రాంతంలో ప్రస్తుతం సాగవుతున్న విధానాలను పూర్తిగా మార్చనున్నారు. పంటల మార్పిడి చేయడంతోపాటు.. రైతు శిక్షణ కేంద్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సాగగలో వస్తున్న నూతన విధానాలను రైతలకు పరిచయం చేస్తారు. ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా అధిక ఉత్పాదన సాధించడం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. రైతలకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించగలుగుతామని పతంజలి చెబుతోంది.
“ఈ ప్రాజెక్టు.. రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడంతో పాటు.. వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుంది” అని ఆచార్య బాలకృష్ణ అన్నారు. స్థానిక వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు.. ఉద్యోగ కల్పన, సామాజికాభివృద్ది జరుగుతుందన్నారు. ఇది మౌ గంజ్ కు కొత్త ప్రారంభమని… ఈ ముందడుగు వింద్య ప్రాంతంలోని రైతుల జీవితాలను పూర్తిగా మారుస్తుందని అన్నారు.





















