Honda Activa : భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
Auto Expo 2025 : ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే. ధరలు తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Honda Activa : ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే. ధరలు తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ద్విచక్ర వాహన మార్కెట్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అనేక స్టార్టప్‌లు , దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో పోటీకి దిగుతున్నాయి. గతేడాది నవంబర్‌లో దిగ్గజ ద్విచక్ర వాహన తయారీదారు హోండా దేశంలో తన బ్రాండ్ నుండి మొదటిసారిగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రిలీజ్ చేసింది. హోండా యాక్టివా ఇ , హోండా క్యూసి1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చింది. హోండా యాక్టివా ఇ మోడల్‌ను మార్చుకోగలిగే బ్యాటరీ సౌకర్యంతో తీసుకువచ్చినప్పటికీ, హోండా స్థిర బ్యాటరీతో క్యూసి1ను తీసుకువచ్చింది. ఈ రెండు స్కూటర్ల బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. హోండా యాక్టివా ఇ స్కూటర్ గ్లోబల్ హోండా సియువి ఇ, పెట్రోల్‌తో నడిచే యాక్టివా స్కూటర్‌ల కలయికతో కూడిన డిజైన్ ఉంటుంది. బ్యాటరీలను మార్చుకోగలిగే విధంగా అందుబాటులో ఉంది. మరోవైపు, హోండా క్యూసి1 ఇ-స్కూటర్‌ను కొన్ని ఫీచర్లను తగ్గించి తక్కువ ధరకు తీసుకువచ్చారు.
డ్యూయెల్ బ్యాటరీ సిస్టమ్
ఈ హోండా యాక్టివా ఇ-స్కూటర్‌లో 6కిలో వాట్స్ పవర్ ని అందించే ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఇది 110సీసీ స్కూటర్‌ను పోలి ఉంటుంది. దీనిలో డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ ఉపయోగించారు. దీనితో, బ్యాటరీలను సులభంగా భర్తీ చేయవచ్చు. ఈ సౌకర్యం వినియోగదారులకు స్కూటర్ పరిధిని పెంచే అవకాశాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది.
Also Read : Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
బ్యాటరీ ఎక్స్ చేంజ్ స్టేషన్లు
హోండా కంపెనీకి సంబంధించిన తక్కువ ధరలో ఈవీ కావాలి అంటే హోండా QC1 మోడల్‌ను ఎంచుకోవచ్చు. దీని లోయర్ వేరియంట్లలో ఎల్ సీడీ ఫీచర్లు ఉంటాయి. అయితే.. హోండా యాక్టివా ఈ కొత్త స్కూటర్ తరహాలో కాకుండా ఇందులో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. హోండా సంస్థ తమ మార్చుకునే బ్యాటరీ మోడల్స్ కోసం బెంగళూరులో 84 బ్యాటరీ ఎక్స్ చేంజ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఉండేవి. తర్వాత.. వీటిని ఇతర నగరాలకు కూడా విస్తరించింది హోండా కంపెనీ. ఈ సంస్థకు చెందిన రెడ్ వింగ్ డీలర్ షిప్ నెట్‌వర్క్ తమ వాహనాల సేల్స్ పెంచుకుంటోంది.
ధర ఎంతంటే ?
హోండా యాక్టివా ఇ స్కూటర్.. మూడు రకాల రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ ఫీచర్లు రోడ్డు పరిస్థితిని బట్టి సహాయపడతాయి. ఇది ఓలా S1 సిరియన్, TVS iQube, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హోండా ఈ స్కూటర్ల అధికారిక ధరకు ప్రకటించింది. ఈ స్కూటర్ల బుకింగ్‌లు ఇప్పటికే వివిధ ప్రాంతాలలో రూ. 1,000 నుండి ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ల డెలివరీ ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, వాటి ధర రూ. 90,000, రూ. 1,17,000లుగా కంపెనీ నిర్ణయించింది.
Also Read :Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

