Sundar C - Arjun Sarja: హిట్ ఇస్తే నెక్స్ట్ సినిమాకు యాటిట్యూడ్ చూపించాడు... యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాను టార్గెట్ చేసిన సుందర్ సి?
ఫ్లాపుల్లో ఉన్న హీరోను పిలిచి సినిమా చేసి హిట్ ఇస్తే ఆ తరువాత చిత్రానికి అతడు యాటిట్యూడ్ చూపించాడని సుందర్ సి చేసిన కామెంట్స్ తమిళనాట వైరల్ అవుతున్నాయి.

సిమ్రాన్ - జ్యోతిక గొడవలో పడి తమిళ మీడియా కాస్త ఆలస్యంగా సుందర్ సి కామెంట్స్ టేకప్ చేసింది. జ్యోతికను సిమ్రాన్ కామెంట్ చేయలేదు. కానీ ఆవిడ మాటలను బట్టి సూర్య భార్యనే సిమ్రాన్ టార్గెట్ చేశారని తమిళ జనాలు చాలా మందితో పాటు మీడియా కూడా భావించింది. అదే విధంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాను సుందర్ సి టార్గెట్ చేశారని ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే...
హిట్ వచ్చిన తర్వాత 100 ప్రశ్నలు వేశాడు!
వడివేలు, సుందర్ సి (Sundar C) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'గ్యాంగర్స్' (Gangers Tamil Movie). ఈ గురువారం (ఏప్రిల్ 24న) థియేటర్లలో విడుదల (Gangers Release Date) కానుంది. అందుకని సుందర్ సి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
Sundar C Targets Arjun Sarja?: ''నేను ఓ సినిమా చేశా. అందులో హీరోకి మార్కెట్ అసలు లేదు. కానీ చాలా పెద్ద రిస్క్ చేసి మరి సినిమా తీశా. ఆ మూవీ భారీ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ అదే హీరోతో మరో సినిమా చేశా. ఆ టైంలో అతను యాటిట్యూడ్ చూపించాడు. ప్రతి సన్నివేశానికి 100 ప్రశ్నలు వేసేవాడు'' అని సుందర్ సి తెలిపారు.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) హీరోగా తమిళంలో 'గిరి' అనే సినిమా తీశారు సుందర్ సి. అది విజయం సాధించింది. ఆ తరువాత అర్జున్, సుందర్ సి కలయికలో 'చిన్నా' అని మరో సినిమా వచ్చింది. అందువల్ల అర్జున్ సర్జాను సుందర్ సి కామెంట్ చేసి ఉంటారని తమిళ ఆడియన్స్ భావిస్తున్నారు.
Also Read: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
సిద్ధార్థ్ హీరోగా కూడా సుందర్ సి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీశారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా రావడానికి ముందు సిద్ధార్థ్ మార్కెట్ ఏమి అంత బాలేదు. సుందర్ సి సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మరో సినిమా చేశారు. అందువల్ల సిద్ధూని అన్నారేమోనని కొంత మంది భావన. అయితే పాతికేళ్ల క్రితం జరిగిందని చెప్పారు కనుక అర్జున్ సర్జాను టార్గెట్ చేశారని మెజారిటీ జనాలు భావిస్తున్నారు.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి
దర్శకుడు సుందర్ సి తీసే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా తమిళనాడులో ఆయన సినిమాలకు ప్రేక్షకులు తండోపతండాలుగా వస్తున్నారు. విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరో హీరోయిన్లుగా 12 ఏళ్ళ క్రితం తీసిన 'మద గజ రాజ' సంక్రాంతికి విడుదలై 100 కోట్ల వసూళ్లు సాధించింది. కమర్షియల్ సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు సుందర్ సి.





















