Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Simran vs Jyothika: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఒక అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆవిడ ఎవరిని టార్గెట్ చేసింది? అనే ప్రశ్న వైరల్ అవుతోంది.

జ్యోతిక (Jyothika)ను విమర్శించిందా? లేదంటే లైలా (Laila)ను టార్గెట్ చేస్తూ సిమ్రాన్ (Simran) ఆగ్రహం వ్యక్తం చేసిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇది. ఇద్దరు హీరోయిన్ల మధ్య జరిగిన డిస్కషన్ వైరల్ అవ్వడం మాత్రమే కాదు... మరొక హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకోవాలని కుతూహలం కూడా ప్రేక్షకులలో ఉంది.
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా బెటర్!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ స్పెషల్ క్యామియో చేశారు. ఆ పాత్రకు మంచి స్పందన లభించింది. తమిళంలో ఆవిడ కొన్ని సినిమాల్లో చేస్తున్నారు. విలన్ రోల్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక అవార్డు వేడుకలో ఆమెకు ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది. అది అందుకున్న తర్వాత సిమ్రాన్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు... ఇటు తెలుగు, అటు తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల ఒక నటికి తాను మెసేజ్ చేశానని, అటువంటి పాత్రలో ఆమెను చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నట్లు సిమ్రాన్ తెలిపారు. అప్పుడు 'ఆంటీ రోల్ చేయడం కంటే అది బెటర్' అని రిప్లై వచ్చిందట. తోటి హీరోయిన్ నుంచి అటువంటి రిప్లై తాను అసలు ఊహించలేదని సిమ్రాన్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అదే వేదిక నుంచి ''డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం, పాతికేళ్ల అమ్మాయికి తల్లిగా కనిపించడం బెటర్'' అని సిమ్రాన్ తెలిపారు.
Simran: i Messaged a Female Co-Actor I was surprised to see you in that role
— AmuthaBharathi (@CinemaWithAB) April 20, 2025
Co-Actor: Atleast it's better than doing a Aunty role
Simran:Such an insensitive reply i got. It's better to do Main Aunty roles than doing Dabba rolepic.twitter.com/XcmPifCodl
జ్యోతికను టార్గెట్ చేశారా? లేదంటే లైలా??
సిమ్రాన్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ చేశారు? అనేది ఇప్పుడు సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల మనసులలో ఉన్న ప్రశ్న. కోలీవుడ్ స్టార్ హీరో భార్య, ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ, ఇప్పుడు డిఫరెంట్ సబ్జక్ట్స్ ఎంపిక చేసుకుంటూ వెబ్ సిరీస్ లేదా సినిమాలు చేస్తున్న జ్యోతిక టార్గెట్ చేసి ఉండొచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఎందుకంటే...
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి
సిమ్రాన్ తన మాటల్లో 'డబ్బా రోల్స్ కంటే ఆంటీగా నటించడం బెటర్' అన్నారు. హిందీలో 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్ చేశారు జ్యోతిక. సో... ఆవిడను అని ఉండొచ్చు అనేది ఒక థియరీ. మరి కొంత మంది లైలాను అన్నారేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే... ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'శబ్దం' సినిమాలో సిమ్రాన్ లైలా కలిసి నటించారు. మరి సిమ్రాన్ ఎవరిని అన్నారనేది ఆవిడ చెబితే తప్ప తెలియదు.
Also Read: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ





















