Sumi Talks: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ
Suma Kancharla: బాడీ షేమింగ్ గురించి సుమీ టాక్స్ అలియాస్ సుమ కంచర్ల ఓ వీడియో చేశారు. స్కూల్, కాలేజీ డేస్ నుంచి బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నానని, తనను ఆ కామెంట్స్ ఏమీ చేయలేవని ఆవిడ చెప్పారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి ముందు నుంచి అలేఖ్య అక్క సుమ కంచర్ల సోషల్ మీడియాలో పాపులర్. సుమీ టాక్స్ పేరుతో ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. పబ్లిక్ చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి తాజా వీడియోలో ఆవిడ కీలక వ్యాఖ్యలు చేశారు.
పందిలా ఉన్నావ్... నువ్వు బఫెలో ఒక్కటే...
మీ ఆయన నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా?
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత కంచర్ల సిస్టర్స్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కామెంట్స్ చేయడం మరీ ఎక్కువ అయింది. పికిల్స్ కాంట్రవర్సీ వదిలేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి కామెంట్స్ సుమ కంచర్ల చదివి వినిపించారు.
'నువ్వు పందిలా ఉన్నావ్', 'నువ్వు, బఫెలో ఒకటే', 'అంత లావు ఉన్నావ్... కార్పొరేట్ ఆఫీసులో నీకు జాబ్ ఎలా ఇచ్చారు', 'నీది మెల్ల కన్నా?', 'మీ ఆయన నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా?' - తన మీద సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలలో కొంత మంది చేస్తున్న కామెంట్స్ ఇలా ఉన్నాయని సుమ కంచర్ల వివరించారు.
బాడీ షేమింగ్ కామెంట్స్ తనను ఏమీ చేయలేవని సుమీ టాక్స్ అలియాస్ సుమ కంచర్ల తెలిపారు. బాడీ షేమింగ్ కామెంట్స్ తనకు చిన్నతనం నుంచి అలవాటేనని పేర్కొన్నారు. స్కూల్ చదివేటప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ తనకు మిస్ బొండం అని పేరు పెట్టిందని, ఆ తర్వాత క్లాస్మేట్స్ అందరూ అదే పేరుతో పిలిచేవారని, అప్పుడు తాను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపారు.
''మిస్ బొండం కామెంట్స్ నన్ను ఇబ్బంది పెట్టాయి. దాంతో తినడం తగ్గించేశాను. అమ్మ చెప్పినా వినేదాన్ని కాదు. ఒక రోజు కింద పడిపోతే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పుడు డాక్టర్లు మీ అమ్మాయి సరిగా తినడం లేదని అమ్మానాన్నతో చెప్పారు. 'మీ నాన్న సంపాదించి తీసుకు వస్తున్నారు. నేను నీకు వండి పెడుతున్నాను. ఎవరో ఏదో కామెంట్ చేశారని తినడం మానేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు?' అని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి బాడీ షేమింగ్ కామెంట్స్ పట్టించుకోవడం మానేశాను'' అని సుమ కంచర్ల వివరించారు.
బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే ఫ్రెండ్స్ వద్దు!
''స్కూల్ లేదా కాలేజ్ లేదా ఆఫీస్ - ఎక్కడో ఒకచోట మన క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారు. అటువంటి ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఇంకొకసారి కామెంట్ చేయవద్దని ముఖం మీద చెప్పేయండి. అటువంటి ఫ్రెండ్స్ అవసరం లేదు'' అని సలహా ఇచ్చారు సుమ కంచర్ల. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే వాళ్లకు అదొక రెండు నిమిషాల సరదా అని, కానీ కామెంట్ చేయించుకున్న వ్యక్తులు ఆ రోజంతా బాధ పడతారని, తర్వాత కూడా కామెంట్స్ తలుచుకుని తమలో తాము కుమిలిపోతారని సుమ కంచర్ల వ్యాఖ్యానించారు. బాల్యంలో తాను చాలా బాధపడ్డానని వివరించారు. ఇప్పుడు తనను ఇటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ఏమి చేయలేవని తెలిపారు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా ఎదుటి వ్యక్తి టాలెంట్ చూడాలని బాడీ గురించి పట్టించుకోవద్దని ఆవిడ పేర్కొన్నారు.
Also Read: మూడు నెలలుగా మిస్సింగ్... ఇప్పుడు శవమై కనిపించాడు... పాతికేళ్లు నిండక ముందే ఇలా జరగడంతో...





















