Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
Odela 2 Climax Explained: 'ఓదెల 2' క్లైమాక్స్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. పరమశివుడు కిందకు దిగి వచ్చినా... ఆత్మ అంతం కాకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంపత్ నంది వాటికి వివరణ ఇచ్చారు.

Odela 2 Latest News: 'ఓదెల 2'కు థియేటర్లలో వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం ఫుల్ ఖుషి ఖుషిగా ఉంది. మూడు రోజుల్లో ఈ సినిమా 6.25 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని అనౌన్స్ చేసింది. అలాగే, సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో 'ఓదెల 2' క్లైమాక్స్ మీద వస్తున్న విమర్శలకు సంపత్ నంది వివరణ ఇచ్చారు. దాంతో 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ అయింది.
పరమ శివుడు దిగివచ్చిన ఆత్మ అంతం కాలేదా?
'ఓదెల 2' చూసిన జనాలకు క్లైమాక్స్ గుర్తు ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా చూడని ప్రేక్షకులు, థియేటర్లలో చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులు ఆర్టికల్ ఇక్కడితో చదవడం ఆపేస్తే మంచిది. ఎందుకంటే... మూవీలో ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక!
శోభనానికి కొన్ని గంటల ముందు నవ వధువులను ఎత్తుకెళ్లి రేప్ చేసిన తిరుపతి తలను భార్య రాధ నరకడంతో మరణిస్తాడు. ఆ శవాన్ని దహనం చేయకుండా ఊరు ప్రజలంతా కలిసి సమాధి శిక్ష వేయడంతో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఆ ప్రేతాత్మను అంతం చేయడానికి 'ఓదెల 2' చివరిలో పరమ శివుడు భూమి మీదకు వస్తాడు. అతను ఇచ్చిన త్రిశూలంతో ఆత్మను శివశక్తిగా మారిన భైరవి అంతం చేస్తుంది. అక్కడితో సినిమా సమాప్తం అయింది. అయితే మళ్లీ తిరుపతి సైకిల్ ఊరిలో తిరిగినట్లు చూపించారు. దాంతో అతని ఆత్మ అంతం కాలేదని చెప్పినట్లు అయింది.
ఏకంగా ఆ పరమ శివుడు కిందకు దిగివచ్చినా సరే తిరుపతి ఆత్మ అంతం కాకపోవడం ఏమిటి? అని పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. శివుడు దిగి రావాల్సిన అవసరం లేదని కొందరు చెబితే... శివుడు వచ్చినా సరే ఆత్మ అంతం కానట్టు చూపించడం బాలేదని మరికొందరు పెదవి విరిచారు. వాటికి సినిమా దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు కథ, మాటలు రాసిన సంపత్ నంది వివరణ ఇచ్చారు.
తిరుపతి కపాల మోక్షం అనుకుంటే ఎలా?
'కపాల మోక్షం జరిగినది తిరుపతి ఆత్మకు అని ఎందుకు అనుకుంటున్నారు?' అని 'ఓదెల 2' సక్సెస్ మీట్ కార్యక్రమంలో సంపత్ నంది వ్యాఖ్యానించారు. తిరుపతి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది 'ఓదెల 3'లో చూపిస్తామని ఆయన తెలిపారు. దాంతో సీక్వెల్ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయింది.
Also Read: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓదెల 2' చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించినప్పటికీ... కర్త, కర్మ, క్రియ అన్ని తానై సంపత్ నంది వ్యవహరించారు. ఈ చిత్రానికి ఆయన కథ, కథనం, మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సినిమా విజయంలో ఆయనది కీలకపాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తిరుపతి ఆత్మ అంతం కాలేదు కనుక 'ఓదెల 3' సినిమాలో వశిష్ట సింహ మళ్లీ కనిపిస్తారని క్లారిటీ వచ్చింది.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి





















