Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్ అయ్యిందా?
Tirumala News: తిరుమలలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందడానికి కారకులు ఎవరు? దీనికి బాధ్యత ఎవరిదని భక్తులు చెబుతున్నారు
Tirumala News: వైకుంఠ ద్వార దర్శన కోసం పది రోజులపాటు నిర్వోహిస్తామని విస్తృతంగా ప్రచారం చేసిన టీటీడీ ఏర్పాట్ల విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదని భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న భక్తులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద వేల మంది నిలిపేశారు. సాయంత్రానికి వారందరినీ ఒక్కసారి ఓపెన్ చేయడంతో తోపులాట జరిగింది.
ఉదయం నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న వారని కౌంటర్లకు విడిచిపెట్టారు. దీనికి తోడు ఉదయం నుంచి ఇస్తారనుకున్న టికెట్లు జనాన్ని కంట్రోల్ చేయడానికి ముందుగానే ఇవ్వడం ప్రారంభించారు. ఇదే విషయం తెలియడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయం పోలీసులకు చెప్పలేదు. అన్ని ప్రాంతాల్లో ఉన్న హోల్డింగ్ పాయింట్ల వద్ద భారీగా జనం రాకతో పరిస్థితి కంట్రోల్ తప్పింది.
ఇంతలో టికెట్లు ఇస్తున్నారని తెలియడంతో భక్తులు వాటిని దక్కించుకోవడానికి పరుగులు పెట్టారు. ఇలా అందర్నీ ఒకేసారి వదలడంతో తోపులాట జరిగింది. ఇలాంటి సమయంలో కింద పడిన భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. గతంలో ప్రత్యేక గదుల్లో ఉంచి టికెట్లు ఇచ్చే వాళ్లని చెబుతున్నారు. అదే పద్దతిని కొనసాగించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.