జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వీ ప్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీస్ పరిశ్రమలో విపరీతంగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలతో ఆ ప్రాంతం కమ్మేసింది. నవంబర్ 26 మధ్యాహ్నానికి ముందు ప్రమాదం జరగ్గా.. సాయంత్రానికి కూడా మంటలు అర్పేందుకు సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. 20 వాటర్ ట్యాంకర్లు, 6 ఆరు ఫైర్ ఇంజన్లలతో అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ప్లాస్టిక్ బ్యాగుల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. గత 7 గంటలుగా మంటలు పెరుగుతూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది.. 7 ఫైరింజన్లు, 40 నీటి ట్యాంకర్లతో రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు అంతస్తుల భవనంలో ఇప్పటికే రెండంస్తులు కాలిపోయాయి. కింది అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వాడే ముడి సరకును నిల్వ ఉంచారు.