Horoscope 8th January 2025: కెరీర్, వ్యాపారం, డబ్బుకు సంబంధించి ఏ ఏ రాశులవారు లాభపడతారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జనవరి 08 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ గౌరవం తగ్గుతుంది. ఒకరి ప్రభావంతో ప్రతిస్పందించడం మానుకోండి. చాలా ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఓ ముఖ్యమైన వస్తువును కోల్పోయే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు వ్యాపార సంబంధిత ప్రయాణాల నుంచి లాభపడతారు. మీరు సాధించిన విజయంతో మీరు సంతృప్తి చెందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రోజు మార్కెటింగ్, సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తుల పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు షేర్ మార్కెట్ నుంచి ప్రయోజనం పొందుతారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు మీరు కార్యాలయంలోని సహోద్యోగిచే ప్రభావితమవుతారు. సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు తగ్గించండి
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. పాత అప్పులు తిరిగి చెల్లిస్తారు. తీర్థయాత్ర ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి మంచి సమయం. ఉద్యోగులకు శుభసమయం.
సింహ రాశి
కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ రోజు ప్రయత్నించండి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేయండి. మీ ప్రవర్తనలో దూకుడు తగ్గించుకోవాలి.
కన్యా రాశి
ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అపరిచితులతో ఎక్కువగా చర్చలు పెట్టుకోవద్దు. ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో మీ హక్కులు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది.
Also Read: మాలవ్య రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం, గజలక్ష్మీ రాజ్యయోగం..ఈ రాశులవారికి పండుగే పండుగ!
తులా రాశి
మీరు ఈరోజు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ప్రేమ సంబంధాలలో మనస్పర్థలకు అవకాశం ఇవ్వొద్దు. విద్యార్థులు తమ చదువులకు సంబంధించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. సహనంగా వ్యవహరించండి. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. భాగస్వామ్యంతో పనిచేయడం ప్రారంభించండి. ధ్యానంపై దృష్టి సారించండి. గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీ అనుభవాలను స్నేహితులతో పంచుకుంటారు. మీ స్వభావంలోకి అహాన్ని తీసుకురావడం మానుకోండి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. చెడు సాంగత్యం వల్ల నష్టం ఉంటుంది
మకర రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. అదృష్టం కలిసొస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు
కుంభ రాశి
ఈ రాశి వారికి సహోద్యోగులతో కొంత ఇబ్బంది ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.ఆధారం లేకుండా ఏ విషయాలపైనా మాట్లాడొద్దు, ఎవర్నీ నిందించవద్దు. మీకు సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు..తుది నిర్ణయం మీరే తీసుకోవడం మంచిది.
మీన రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. అతిథులను కలుస్తారు. మీ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!