January Holiday and Festival 2025: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!
Festival In January 2025: వైకుంఠ ఏకాదశి, భోగి, సంక్రాంతి, కనుమ సహా జనవరి 2025లో వచ్చే పండుగల జాబితా ఇదే..
January Holiday and Festival 2025: ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభంగా చెప్పే జనవరిలో ఉపవాసాలు, పండుగల పరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎప్పటిలా సంక్రాంతి పండుగే కాదు..ఈ ఏఢాది మహాకుంభమేళా కూడా ప్రత్యేకం
జనవరి 10 - వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి (Vaikunta Ekadashi 2025)
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలో అడుగుపెట్టే ముందు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొనే సమయం. ఈ రోజు ఉత్తరద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం
జనవరి 11- శని త్రయోదశి (Shani Trayodashi 2025)
శనివారం శనికి ప్రత్యేకం...ఇదే రోజు త్రయోదశి తిథి వస్తే మరింత పవర్ ఫుల్. ఈ రోజు పుణ్యస్నానం ఆచరించి శనిదేవుడికి తైలాభిషేకం చేసి, దాన ధర్మాలు చేస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఆంజనేయుడు, ఈశ్వరుడిన పూజించినా శని ప్రభావం తగ్గుతుంది
Also Read: మహా కుంభమేళాకి ప్రయాగ్ రాజ్ లో భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC స్పెషల్ ట్రైన్స్!
జనవరి 13- భోగి పండుగ (Bhogi Pongal 2025 Date)
సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. ఈ రోజు భోగి మంటలు వెలిగించి పండుగను ప్రారంభిస్తారు. భోగిపళ్లు పోస్తారు.. బొమ్మల కొలువు పెడతారు. ముత్తైదువులను పిలిచి పేరంటం చేస్తారు.
జనవరి 13- మహా కుంభమేళా (Mahakumbh 2025)
12 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా కూడా ఈ ఏడాది భోగి రోజు నుంచి ప్రారంభం కానుంది. మహాశివరాత్రి వరకూ వైభవంగా జరిగే కుంభమేళాకు కోట్ల మంది భక్తులు హాజరవుతారు
జనవరి 14 - మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం (Makara Sankranti 2025)
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి పండుగొస్తుంది. ఈ రోజు నుంచి సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. భోగి పండుగ రోజు మొదలయ్యే సందడి సంక్రాంతికి ఊపందుకుంటుంది. రంగు ముగ్గులు, బసవన్నలు, హరిదాసులు సందడి వాడవాడలా కనిపిస్తుంది.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
జనవరి 15- కనుమ పండుగ (Kanuma 2025)
కనుమ వ్యవసాయదారుల పండుగగా చెబుతారు. ఈ రోజు పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాటిని అందంగా అలంకరించి పూజిస్తారు. కోళ్ల పందాలు, ఎడ్ల బండ్ల పందాలు పోటాపోటీగా జరుగుతాయి
జనవరి 17 సంకరహర చతుర్థి (Sankatahara chaturthi 2025)
ప్రతి తెలుగు నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజిస్తే ఉద్యోగ , వ్యాపారంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం
జనవరి 25 ఏకాదశి
నెలకు రెండు ఏకాదశిలు వస్తాయి..పుష్యమాసంలో జనవరి 10న ముక్కోటి ఏకాదశి వస్తే..మళ్లీ జనవరి 25న మరో ఏకాదశి వస్తోంది. ఏ ఏకాదశి అయినా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమే..
జనవరి 26 రిపబ్లిక్ డే (Republic Day 2025)
జనవరి 28 మాస శివరాత్రి
శివ భక్తులకు మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో కృష్ణ పక్షంలో వచ్చే చుతర్థశి రోజు మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే ఆరోగ్య వృద్ధి , కుటుంబంలో శాంతి ఉంటుందని చెబుతారు.
జనవరి 29 మౌని అమావాస్య (Mauni Amavasya 2025)
పుష్యమాసం చివరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఏడాది పొడవునా 12 అమావాస్యలు వస్తాయి.. వీటిలో మౌని అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉందని చెబుతారు. పితృదేవతల ఆశీస్సులు పొందేదుకు ఈ రోజుని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.