Shubha Yoga 2025: మాలవ్య రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం, గజలక్ష్మీ రాజ్యయోగం..ఈ రాశులవారికి పండుగే పండుగ!
2025 సంవత్సరంలో మూడు శుభ యోగాలు ఏర్పడతాయి... మాలవ్య రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం, గజలక్ష్మీ రాజ్యయోగం... ఈ యోగాలు వల్ల కొన్ని రాశులవారు విశేష ప్రయోజనాలు పొందుతారు...
ఈ ఏడాది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అతి పెద్ద గ్రహాలు రాశులుమారుతున్నాయి. గ్రహాలు, నక్షత్రాల గమనం వల్ల ఈ సంవత్సరం ఎన్నో శుభ యోగాలు కలుగుతాయి. శని, బృహస్పతి రాశులు మారుతున్నాయి. శని కుంభరాశి నుంచి మీనం లోకి మారడం వల్ల కొన్ని రాశులవారికి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది..కొన్ని రాశులవారికి శని నుంచి విముక్తి లభిస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా 2025లో కొనని రాశులవారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. బృహస్పతి శుభ సంచారం కారణంగా, వ్యాపారం, వృత్తి , ఉద్యోగంలో కూడా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది మూడు శుభ యోగాలు రానున్నాయి. ఈ శుభయోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారి జీవితంలో విశేష ప్రయోజనాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు లేదంటే హాజరవుతారు. 2025లో ఏర్పడే మూడు శుభయోగాలు ఇవే..
Also Read: కుంభమేళాకు పుష్కరానికీ తేడా ఏమిటి? ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
మాలవ్య రాజ్యయోగం
2025లో మొదట ఏర్పడేది మాలవ్య రాజయోగం. ఇది జనవరి 28న ఏర్పడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలో మాలవ్య రాజ్యయోగం చాలా పవిత్రమైనది, అరుదైన , శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుని రాశిచక్ర గుర్తులు వృషభం, తులారాశి. శుక్రుడిని లగ్జరీ, అందం, ఐశ్వర్యం, కళ మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి కారకుడిగా పరిగణిస్తారు. 2025లో ఈ మాలవ్య రాజయోగం వల్ల 4 రాశుల వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశులలో వృషభం, మిథునం, కన్య, మీనం ఉన్నాయి. ఈ రాశులవారికి ఈ ఏడాది మొత్తం సంపద, సంతోషం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
లక్ష్మీ నారాయణ యోగం
2025లో ఏర్పడే మరో శుభయోగం లక్ష్మీ నారాయణయోగం. ఈ యోగం ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఏడాది లక్ష్మీనారాయణ రాజయోగం ఫిబ్రవరి 27 నుంచి మే వరకూ మీన రాశిలో ఏర్పడుతోంది. బుధుడు , శుక్రుడు రెండు గ్రహాలు కేంద్ర గృహంలో ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పుడు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మిథునం, కన్య, ధనుస్సు, మీనం రాశుల వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. 2025 సంవత్సరంలో ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు.
Also Read: ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్..కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు!
గజలక్ష్మీ రాజ్యయోగం
2025 సంవత్సరంలో ఏర్పడే మరో శుభయోగం గజలక్ష్మీ రాజ్యయోగం. వైదిక జ్యోతిషశాస్త్రంలో గజలక్ష్మీ రాజ్యయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దేవగురువు బృహస్పతి , శుక్రుడు జాతకంలో కలిసి ఉన్నప్పుడు లేదా ఒకదానికొకటి మధ్య గృహంలో ఉన్నప్పుడు గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. 2025వ సంవత్సరంలో మే 15వ తేదీన బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించినప్పుడు యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మిథునం, కన్య, కుంభం, సింహం, మేష రాశుల వారు విశేష ప్రయోజనం పొందుతారు. ఈ రాశిచక్రం యొక్క వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి మరియు వారు గౌరవం, ఆనందం మరియు సంపద పొందుతారు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
Note: ఆధ్యాత్మిక గ్రంధాలు, పండితులు తెలియజేసిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. ఈ ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.