PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP Desam
సమఉజ్జీల్లాంటి టీమ్స్. పాయింట్స్ టేబుల్ లో రెండు జట్లు 5,6 స్థానాల్లో ఉన్నాయి. మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్..మ్యాచ్ గెలవటం..మ్యాచ్ ఓడిపోవటం అంటూ.. ఆల్టర్నేటివ్ తో వస్తున్న కోల్ కతా తలపడిన ఈ మ్యాచ్ మంచి లో స్కోర్ థ్రిల్లర్ తో ఉక్కిరి బిక్కిరి చేశాయి. తీవ్ర ఉత్కంఠ పోరులో ఫైనల్ గా పంజాబ్ KKR పై 16 పరుగుల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ప్రియాంశ్ - ప్రభ్ సిమ్రన్ మెరుపులు
ముల్లాన్ పూర్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు మంచి ఆరంభమే లభించినట్లు కనిపించింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ తమ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాగానే ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప్రియాంశ్ ఆర్య 12 బంతుల్లోనే 3ఫోర్లు, ఓ సిక్సర్ తో 22పరుగులు చేస్తే...ప్రభ్ సిమ్రన్ సింగ్ 15 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్సర్లతో 30 పరుగులు చేశారు. ఈ ఇద్దరి జోరుకు 3 ఓవర్లలోనే 39పరుగులు చేసింది అయితే అక్కడే పంజాబ్ కు ఊహించని షాక్ తగిలింది.
2. హర్షిత్ రానా మాస్ బౌలింగ్
మొదటి బంతికే తనను సిక్సర్ బాది ధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేయటంలో వికెట్ల వేట మొదలుపెట్టాడు కిస్సింగ్ స్టార్ హర్షిత్ రానా. ఆర్య ఇచ్చిన క్యాచ్ ను రమణ్ దీప్ సింగ్ ఒడిసి పట్టుకున్నాడు. ఇక కెప్టెన్ అయ్యర్ దిగాడు. మంచి ఫామ్ లో ఉన్న అయ్యర్ ధాటిగా ఆడతాడు అనుకుంటే ఆడిన రెండో బంతికే డకౌట్ అయిపోయాడు. మళ్లీ రానానే బౌలింగ్..రమణ్ దీపే క్యాచ్. తన రెండో ఓవర్ లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేశాడు హర్షిత్ రానా. ప్రభ్ సిమ్రన్ తనను వరుసగా రెండు సిక్సులు బాదాడు. అయితే అదే ఓవర్ చివర్లో ప్రభ్ సిమ్రన్ వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రానా..మళ్లీ రమణ్ దీప్ సింగే అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అలా రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి మ్యాచ్ ను కేకేఆర్ వైపు తిప్పాడు రానా.
3. 111కే ఆలౌట్
ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యాక పంజాబ్ ను ఆదుకున్న నాధుడే లేడు. నేహల్ వధీరా, శశాంక్ సింగ్ కాస్త బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ అవ్వలేదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పంజాబ్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.
4. క్రేజీ చాహల్..పంజాబ్ ఫైర్
కొట్టాల్సిందే 112 పరుగులే కదా..కోల్ కతా టీమ్ కి ఉన్న డెప్త్ బ్యాటింగ్ కి అది జుజుబి అనుకున్నారు అంతా. కానీ పంజాబ్ బౌలర్లు బీభత్సంగా పోరాడారు. మ్యాచ్ మొదలైన 8 బంతులకే ప్రమాదకర ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ లను అవుట్ చేశారు పంజాబ్ బౌలర్లు. నరైన్ మార్కో జాన్సన్ బౌల్డ్ చేస్తే..డికాక్ వికెట్ ను బార్ట్లెట్ తీసుకున్నాడు.కానీ కెప్టెన్ రహానే, కుర్రాడు రఘువంశీ అడ్డుపడ్డారు. ఓ దశలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి లక్షం దిశగా సాగింది. ఇక అక్కడ మొదలైంది చాహల్ అన్న విధ్వంసం. 3 ఓవర్లు వేసి 12పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీసి కేకేఆర్ నడ్డి విరిచాడు చాహల్. సెట్ బ్యాటర్సైన రహానే, రఘువంశీ సహా రింకూ సింగ్, రమణ్ దీప్ ల సింగ్ వికెట్లు తీసి ఊహించని షాక్ ఇచ్చాడు చాహల్. ఫలితంగా 79 పరుగులకే 8వికెట్లు కోల్పోయింది కేకేఆర్.
5. రస్సెల్ - ది వన్ మేన్ ఆర్మీ
అందరూ అయిపోయారు ఎవ్వరూ లేరు ఒక్క రసెల్ మాత్రమే ఉన్నాడు. కొట్టాల్సింది తక్కువే కావచ్చు కానీ ఒక్క బంతి ఆడినా గొప్పే అన్నట్లుగా విధ్వంసం చేస్తున్న పంజాబ్ బౌలర్లు. అలాంటి టైమ్ లో PBKS బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు రస్సెల్. ఏ చాహల్ అయితే నాలుగు వికెట్లు తీశాడో అదే చాహల్ ను తన లాస్ట్ ఓవర్ లో ఓ ఫోరు రెండు సిక్సులు బాది నేనున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అర్ష్ దీప్ సింగ్ మ్యాజిక్ చేసి వైభవ్ అరోరాను అవుట్ చేసి మళ్లీ పంజాబ్ ను మ్యాచ్ లో తీసుకొచ్చాడు. ఇక మిగిలింది ఒకటే వికెట్. ఆంద్రే రస్సెల్ ను మార్కో జాన్సన్ క్లీన్ బౌల్డ్ చేసి 95 పరుగులకే కేకేఆర్ ను ఆలౌట్ చేసి సంచలన విజయం సాధించేలా చేశాడు మార్కో జాన్సన్.
ఐపీఎల్ చరిత్రలో 111 పరుగుల లోయెస్ట్ స్కోరును ఢిపెండ్ చేసుకున్న టీమ్ గా పంజాబ్ సంచలన రికార్డు ను నెలకొల్పింది. ఈ విక్టరీతో పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది.




















