Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
Andhra Pradesh Latest News:వైజాగ్‌లో టిసిఎస్‌కు 21.16 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎకరా 99 పైసలకు కేటాయించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TCS In Vizag: వైజాగ్‌లో సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టిసిఎస్‌కు (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ) 21.16 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఏపీలో ఐటీ అభివృద్ధిలో కీలక ముందడుగుగా ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
మంగళవారం ఏపీ సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ 21.16 ఎకరాలను టిసిఎస్‌కు కోసం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. మంత్రి నారా లోకేష్ గత ఏడాది అక్టోబర్‌లో టాటా హౌస్‌ను సందర్శించి, టిసిఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడిగారు. దీనికోసం ఆయన చేసిన ఫాలోఅప్ వర్క్ ఔట్ కావడంతో TCS ముందుకు వచ్చింది. ఏపీలో పెట్టె యూనిట్ ద్వారా 12,000 ఉద్యోగాలను సృష్టించడానికీ రూ.1370 కోట్లు పెట్టుబడి కేటాయించనుంది ఆ సంస్థ.
రాష్ట్ర ప్రభుత్వం, టిసిఎస్‌ల మధ్య నిరంతర ఫాలోఅప్‌లు, చర్చల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. టిసిఎస్‌కు భూ కేటాయింపులో ఏపీ ప్రభుత్వం చివరికి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉందని IT పరిశ్రమకు సూచించడానికి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఎకరా 99 పైసలకు ఆ సంస్థకు కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
గతంలో ప్రధాని మోదీ చేసిందే.. ఇప్పుడు మేమూ చేసాం : ఏపీ ప్రభుత్వం
గతంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టాటా మోటార్స్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు 99 పైసలకు భూమిని కేటాయించడం ద్వారా తీసుకెళ్లారు. తర్వాత ఆ చర్య గుజరాత్‌లోని ఆటో పరిశ్రమ అభివృద్ధికి ఒక మైలురాయిగా మారింది. అలాగే ఇప్పుడు టిసిఎస్‌కు తక్కువ ధరకు భూమిని కేటాయించడం ద్వారా వారితో ఇక్కడ పెట్టుబడి పెట్టించడం.. ఉద్యోగాలను సృష్టించడం ఏపీలో ఐటీ పరిశ్రమ డెవలప్మెంట్‌లో ఒక గేమ్ చేంజర్‌గా మారుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం - సీఐఐ ఎపి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిఏడాదిలోనే రాష్ట్రప్రజలు, పరిశ్రమదారులు, అధికార యంత్రాంగం అందరి సహకారంతో ఆర్థిక వృద్ధి రేటు (జిఎస్ డిపి)లో దేశంలో 2వస్థానాన్ని సాధించగలిగామన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ..."దేశంలోనే ఎపిలో అతితక్కువ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలస్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చాను. విశాఖపట్నాన్ని ఐటి హబ్‌గా తయారుచేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఐటి రంగంలో రాబోయే అయిదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాను. తయారీ రంగంలో 30లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం. అమరావతి రాజధాని ఆర్థికవృద్ధి కేంద్రంగా అవతరించనుంది. అమరావతిని శక్తివంతంగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాను." అని చెప్పారు.
ఈరోజు ఏపీ ప్రభుత్వం - సీఐఐ ఎపి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశంలో పాల్గొన్నాను. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిఏడాదిలోనే రాష్ట్రప్రజలు, పరిశ్రమదారులు, అధికార యంత్రాంగం అందరి సహకారంతో ఆర్థిక వృద్ధి రేటు (జిఎస్ డిపి)లో దేశంలో 2వస్థానాన్ని సాధించగలిగాం,… pic.twitter.com/f4DEkuHRFd
— Lokesh Nara (@naralokesh) April 15, 2025





















