అన్వేషించండి

AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

SET Jobs: ఏపీలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,260  పోస్టులను భర్తీచేయనున్నారు.

Recruitment of Special Education Teachers: ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 2,260  పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఖాళీల్లో 1,136 స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు; 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడనుంది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు ఇలా..
ఉమ్మడి జిల్లాల వారీగా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎస్‌జీటీ పోస్టుల‌ను ప్రైమరీ లెవ‌ల్‌, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల‌ను సెకండరీ లెవ‌ల్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఎస్జీటీ పోస్టులు అధికంగా గుంటూరు జిల్లా పరిధిలో 151 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కర్నూలు జిల్లా పరిధిలో 130 పోస్టులు ఉన్నాయి.

జిల్లా ఎస్‌జీటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్  పోస్టులు
అనంత‌పురం  101 100
చిత్తూరు 117 82
తూర్పుగోదావ‌రి 127 151
గుంటూరు 151 98
వైఎస్ఆర్ క‌డ‌ప 57 49
కృష్ణా 71 89
క‌ర్నూలు 110 130
శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు 63 44
ప్రకాశం 74 50
శ్రీకాకుళం 71 109
విశాఖ‌ప‌ట్నం 59 52
విజ‌య‌న‌గరం 45 66
ప‌శ్చిమ గోదావ‌రి 90 105

విద్యాహక్కుల పునరుద్ధరణ లక్ష్యం.. 
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికే అని చెప్పవచ్చు. విద్యారంగంలో అసమానతలు తొలగించి, సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ఖాళీలను భర్తీచేయడం ద్వారా.. విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని  ప్రభుత్వం ఆశిస్తోంది.ల ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.

నియామక ప్రక్రియ ఇలా..
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామాకాలను సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం కానుంది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు.. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget