అన్వేషించండి

Jobs 2025: గుడ్‌న్యూస్, తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్ కీలక ప్రకటన

Telangana RTC MD Sajjanar | త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని స్పష్టం చేశారు.

Telangana RTC Jobs | హైదరాబాద్: తెలంగాణలో త్వరలో ముప్పై, నలబై వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సంస్థలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. కొత్త పోస్టుల భర్తతో ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఉద్యోగులు కార్మికులపై పనిభారం తగ్గుతుందన్నారు.

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాం.  భవిష్యత్ లోనూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలి. ఆర్టీసీలో త్వరలోనే మూడు వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేస్తాం. 

కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని’ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు రాజశేఖర్, మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్‌ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్‌ మేనేజర్‌ శ్రీలత, ఆర్టీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
Google Summer Internship 2027 India: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Best Mileage Cars: కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
Embed widget