IPL 2025 KKR VS PBKS Result Update: చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
IPL 2025 PBKS VS KKR Updates: థ్రిల్లింగ్ గా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ అద్భుతం చేసింది. లీగ్ చరిత్రలో 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకుంది. దీంతో 16 రన్స్ తో కేకేాఆర్ ను కంగుతినింపించింది.

IPL 2025 low Score Thriller B/W PBKS VS KKR: పంజాబ్ కింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. లీగ్ చరత్రలో ఇప్పటివరకు ఏ జట్టు చేయలేని అద్భుతాన్ని చేసింది. 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో 16 పరుగుల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. న్యూ చంఢీగడ్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కు బ్యాటర్లు నిరాశజకనమైన ప్రదర్శన ఇచ్చారు. బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటయ్యారు. ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒక దశలో 74/4 తో నిలిచిన పంజాబ్.. అనూహ్యంగా 37 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. బౌలర్లో హర్షిత్ రాణా మూడు వికెట్లతో రాణించింది. ఇక ఛేజింగ్ లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ బోల్తా కొట్టింది. 15.1 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. మిడిలార్దర్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ (37) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యజ్వేంద్ చాహల్ నాలుగు వికెట్లతో రాణించాడు.
Low-scoring thriller on the cards? 👀
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Yuzvendra Chahal & Glenn Maxwell deliver crucial breakthroughs to put the game in balance 👊
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/kv64WUZ7P7
రాణించిన ప్రభు సిమ్రాన్..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆకట్టుకోలేక పోయింది. గత మ్యాచ్ లో 245 పరుగుల భారీ స్కోరును సాధించిన ఫియర్లెస్ బ్యాటింగ్ ను ఈ మ్యాచ్ లో ప్రదర్శించ లేక పోయింది. నిజానికి మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (12 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ప్రభుసిమ్రాన్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే వీరిద్దరితోపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ డకౌట్ కావడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. మిడిలార్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో శశాంక్ సింగ్ (18), జేవియర్ బార్లెట్ (11) డబుల్ డిజిట్ స్కోర్లతో కాస్త రాణించడంతో పంజాబ్ 110 పరుగుల మార్కును దాటింది. అయితే ఇన్నింగ్స్ లో ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ బ్యాటింగ్ ముగియడం గమనార్షం. ఇక మిగతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రెండేసి వికెట్లతో సత్తా చాటారు.
Low-scoring thriller on the cards? 👀
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Yuzvendra Chahal & Glenn Maxwell deliver crucial breakthroughs to put the game in balance 👊
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/kv64WUZ7P7
ఆరంభంలో షాక్..
చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. వరుస ఓవర్లలో ఓపెనర్లు సునీల్ నరైన్ (5), వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (5) త్వరగా ఔటయ్యారు. దీంతో 7 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఇక ఫీల్డర్ తప్పిదంతో తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడిన రఘువంశీ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (17) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రహానే యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా, రఘువంశీ దూకుడుగా ఆడటంతో మూడో వికెట్ కు 55 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. అయితే 9 బంతుల తేడాతో వీరిద్దరూ ఔట్ కావడంతోపాటు వెంకటేశ్ అయ్యర్ (7) విఫలం కావడంతో 74 పరుగులకే సగం వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఎల్బీగా ఔటైన రహానే.. రివ్యూ తీసుకోకపోవడం శాపంగా పరిణమించింది. ఆ తర్వాత కూడా విరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కేకేఆర్ మరింత కస్టాల్లో పడింది. ఒక దశలో 62/2తో నిలిచిన కేకేఆర్.. పంజాబ్ బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి 95/9తో నిలిచింది. 16వ ఓవర్లో అండ్రూ రస్సెల్ (17) వికెట్ తీసిన యన్సెన్ పంజాబ్ కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఈ విజయంతో నాలుగు గెలుపులతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పంజాబ్ ఎగబాకింది. మిగతా బౌలర్లలో యన్సెన్ మూడు వికెట్లు తీశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

