అన్వేషించండి

PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతా

 గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తనకున్న మంచి జట్టుతో అద్భుతమైన విజయాలు సాధిస్తూ పంజాబ్ పాయింట్లు పెంచుతున్నాడు. మరి ఈరోజు అదే కోల్ కతాను ఢీకొట్టనున్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ కప్ గెలిచి పెట్టిన జట్టు నుంచి బయటకు వచ్చేసిన అయ్యర్ దానికి స్పెసిఫిక్ రీజన్ మాత్రం ఏంటో ఎప్పుడూ చెప్పలేదు. కెప్టెన్ గా కప్ గెలిచి పెట్టినా ఆటగాడిగా అంత ఫామ్ లో లేడని లాస్ట్ టైమ్ కేకేఆర్ భావించి ఉండొచ్చు. కానీ తర్వాత ఫామ్ ను అందిపుచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ అటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇటు పంజాబ్ కి బ్యాటర్ గానూ ఇరగదీస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 250 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతూ ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు అయ్యర్. మరి అంతటి ఫామ్ లో ఉన్న అయ్యర్ ఈ రోజు కోల్ కతాను కెప్టెన్ గా బ్యాటర్ గా ఎలా ఎదుర్కోనున్నాడనే విషయమే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీమ్ బలాబలాలు చూసుకుంటే పాయింట్ల పట్టికలో కోల్ కతానే ప్రస్తుతం పైన ఉన్నట్లు కనిపిస్తున్నా పంజాబ్ దుర్భేధ్యంగా ఉంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో మొదలు పెడితే అశుతోష్ శర్మ వరకూ ప్రతీ బ్యాటర్ టచ్ లోనే ఉన్నాడు. బౌలింగ్ కూడా అంతే టాప్ క్లాస్ గా ఉంది. అభిషేక్ శర్మ చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు కానీ లేదంటే మొన్న పంజాబ్ హైదరాబాద్ మ్యాచ్ లో ఏకంగా 245పరుగుల టార్గెట్ పెట్టింది. మరో వైపు కేకేఆర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అజింక్యా రహానే కూల్ అండ్ కామ్ నెస్ కి తోడు నరైన్ కొండంత అండగా ఉంటున్నాడు అటు బ్యాటింగ్ కి ఇటు బౌలింగ్ కి తురుపు ముక్కలా మారి కోల్ కతా విజయాల్లో కీరోల్ పోషిస్తున్నాడు. రింకూ సింగ్ కూడా ఫామ్ లోకి రావటం కేకేఆర్ కు హ్యాపీ. రస్సెల్ కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే కేకేఆర్ నుంచి పంజాబ్ కి రిస్కే. చూడాలి మరి గతేడాది కప్పు తెచ్చి పెట్టిన కెప్టెన్ ఈ సారి కేకేఆర్ కు చేతిలో చిప్ప పెడతారేమో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
ABP Premium

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget