
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Dhanush Aishwarya Divorce Judgement: కోలీవుడ్ స్టార్ ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు చెన్నై కోర్టు విడాకుల మంజూరు చేసింది.

తమిళ కథానాయకుడు (Dhanush) ధనుష్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ (పాన్ ఇండియా) ప్రేక్షకులకు సుపరిచితుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద అల్లుడు అని ఒకప్పుడు ఆయనను కొంత మంది గుర్తు పట్టేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు ఆయన కూడా రజనీకాంత్ అల్లుడు కాదు... మాజీ అల్లుడు. ఇవాళ చెన్నై ఫ్యామిలీ కోర్టు ఆయనకు విడాకుల మంజూరు చేసింది.
ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు
రజనీకాంత్ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య (Aishwarya Rajinikanth)తో 2004లో ధనుష్ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కారణాలు ఏమిటి అనేది తెలియదు కానీ... వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17, 2022లో తాము వేరు పడుతున్నట్లు ప్రకటించారు.
ధనుష్, ఐశ్వర్య విడిపోకూడదని కోరుకున్న అభిమానులు ఉన్నారు. అదే విధంగా వాళ్ళిద్దరూ తమ మధ్య జరిగిన విషయాలు పక్కన పెట్టి ఒకటి కావాలని, కలిసిపోవాలని ఆశించిన ప్రేక్షకులు సైతం ఉన్నారు. అయితే... విడిగా ఉండడానికే వాళ్ళిద్దరూ ముగ్గు చూపారు. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ పిడిషన్ దాఖలు చేశారు. ఇకపై తాము కలిసి ఉండలేమని అందులో పేర్కొన్నారు.
నవంబర్ 21న కోర్టులో ధనుష్, ఐశ్వర్య హాజరు అయ్యారు. తాము విడిపోవడానికి నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను నవంబర్ 27కు కోర్టు వాయిదా వేసింది. ఈ రోజు వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చినట్లు తీర్పు వెల్లడించింది.
ఇద్దరు పిల్లలు... 18 ఏళ్ల వైవాహిక జీవితం!
విడాకుల విషయాన్ని వెల్లడించినప్పుడు... గత 18 సంవత్సరాలుగా తాము స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికి ఒకరు అండగా ఉన్నామని ధనుష్ పేర్కొన్నారు. తామిద్దరం కలిసి జీవితంలో ఎదిగామని, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టు అడ్జస్ట్ అయ్యామని ఆయన వివరించారు. ఇప్పుడు తమ దారులు వేర్వేరు అయ్యాయని తెలిపారు. తమ నిర్ణయాన్ని గౌరవించి తమకు స్వేచ్ఛ ఇవ్వాలని, తమకు ప్రైవసీ అవసరమని కూడా పేర్కొన్నారు.
Also Read: అమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
యాత్ర, లింగ... ఇకపై మాజీ దంపతులు అయినటువంటి ధనుష్, ఐశ్వర్య సంతానం. ఇద్దరు వడిపోయినప్పటికీ... చెన్నైలోని ఓ ఎస్ గార్డెన్ ప్రాంతంలో పక్కపక్క ఇళ్లల్లోనే నివాసం ఉంటారు. పిల్లలు ఇద్దరి బాధ్యతలు సమానంగా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.
నయనతార ఇష్యూలో కోర్టుకు వెళ్ళిన ధనుష్!
కోర్టుకు సంబంధించిన మరొక అంశంతో ధనుష్ ఇవాళ వార్తల్లో నిలిచారు. తమ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ అనుమతి లేకుండా తమ సంస్థ తీసిన 'నానుమ్ రౌడీ దాన్' చిత్రీకరణ సమయంలో తీసిన వీడియోలను నయనతార విగ్నేష్ శివన్ తమ పెళ్లి డాక్యుమెంటరీలో వినియోగించారని కోర్టుకు వెళ్లారు. ఆ కేసులో ప్రతివాదులకు కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఎప్పటికి తేలుతుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
