Bigg Boss 18: బిగ్ బాస్ హౌస్‌లో కూతురిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన Mahesh Babu మరదలు... ఇదీ నమ్రత రియాక్షన్
Bigg Boss 18 : బిగ్ బాస్ హిందీ సీజన్ 18 ఫ్యామిలీ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో కంటెస్టెంట్ శిల్పా శిరోద్కర్ తన కూతురిని చూసి ఎమోషనల్ కాగా, నమ్రతా స్పందించింది.
'బిగ్ బాస్ సీజన్ 8' తెలుగులో సక్సెస్ ఫుల్ గా పూర్తయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లోనే ఈ షో పూర్తి కాగా... నిఖిల్ విన్నర్ కాగా, గౌతమ్ రన్నర్‌గా నిలిచారు. అయితే మిగతా భాషల్లో మాత్రం కాస్త లేటుగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో ఇంకా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా హిందీలో సీజన్ 18 చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ షోలో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ రాగా, అందులో మహేష్ మరదలు తన కూతుర్ని చూసి ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కూతురిని చూసి శిల్పా శిరోద్కర్ ఎమోషనల్
ఒకప్పుడు నటిగా తెలుగు, హిందీ భాషల్లో రాణించిన శిల్పా శిరోద్కర్, ఆ తర్వాత పలు టెలివిజన్ సీరియల్స్ లో కూడా కనిపించింది. తాజాగా ఆమె బిగ్ బాస్ సీజన్ 18 హిందీ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఈ షోలో ఫ్యామిలీ వీక్ కు సంబంధించిన ఎపిసోడ్ నడుస్తుండగా, దానికి సంబంధించిన ప్రోమోని బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. నెలల తరబడి ఫ్యామిలీకి దూరంగా, బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు సెలబ్రిటీలు. షో ఎండింగ్ లో వచ్చే ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తారు. ఒక్కసారిగా వాళ్ళను చూడగానే ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేదు. అలాగే ఆ ప్రోమోలో శిల్పా తన కూతురు సర్ప్రైజ్ ఎంట్రీని చూసి వెక్కివెక్కి ఏడ్చేసింది. బిగ్ బాస్ ఆదేశాల కారణంగా కదలడానికి వీలులేకపోవడంతో, కూర్చున్న దగ్గరే కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రిలీజ్ చెప్పగానే, తన కుమార్తెను గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అయింది. చాలా రోజుల తర్వాత కూతుర్ని కలవడంతో ముద్దులతో ముంచెత్తి, తన ప్రేమను వ్యక్తం చేసింది.
View this post on Instagram
నమ్రత శిరోద్కర్ రియాక్షన్
ఈ నేపథ్యంలోనే ఆ వీడియోపై శిల్పా శిరోద్కర్ సోదరి నమ్రత శిరోద్కర్ రియాక్ట్ అయింది. కామెంట్స్ బాక్స్ లో తల్లి, కూతుర్ల మధ్య ఈ అందమైన క్షణాన్ని చూసినందుకు సంతోషంగా ఉందనే విషయాన్ని ఎమోజీల ద్వారా స్పష్టం చేసింది. కాగా నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. అంటే మహేష్ బాబుకు శిల్పా శిరోద్కర్ మరదలు అన్నమాట. ప్రస్తుతం శిల్పా 'బిగ్ బాస్ సీజన్ 18'లో టాప్ ప్లేయర్లలో ఒకరిగా ఉంది. స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతూ, ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ 18 వీకెండ్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్... మహేష్ బాబు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమాల్లో ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో ఎంత సింపుల్ గా ఉంటారు ? అనే విషయాన్ని కంపేర్ చేసి చెబుతూ, అందరూ మహేష్ బాబు లాగే రియల్ లైఫ్ లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని లైఫ్ లెసన్స్ చెప్పారు. ఇక ఇప్పుడు శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ అయినా వీడియోపై నమ్రత రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.