Vijayawada News: ఎంతకు తెగించార్రా? - బయట యూట్యూబ్ చానల్ బోర్డు లోపల కసామిసా యాపారమా?
Crime News: స్పాల పేరుతో వ్యభిచారం చేయించే వాళ్లను చూశాం కానీ.. యూట్యూబ్ చానల్ పేరుతో కూడా వ్యభించారం చేయించేవాళ్లు ఉన్నారు. ఆ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.

Vijayawada police: విజయవాడ మాచవరంలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ , అందులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టూడియో 9,( స్పా) పై సిబ్బందితో కలసి రైడ్ చేసిన మాచవరం సిఐ ప్రకాష్ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేరుతో బోర్డు పెట్టుకుని స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రెయిడ్ చేశారు. ఈ దాడిలో 10 మంది మహిళలు, 13 మంది, విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులుర స్టేషన్ కు తరలించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో గుట్టుగా ...
మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ ను నిర్వహిస్తున్నారు.పోలీసులు దాడి చేసిన సమయంలో ప్రసన్న భార్గవ్ లేరు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ స్పా సెంటర్లలో ఇలాంటి వ్యవహారాలు నడిపేవారు. వాటిపై పోలీసుల నిఘా పెరగడంతో .. యూట్యూబ్ చానల్ పేరుతో స్పా పెట్టి.. అందులోనే ఇలాంటివి నిర్వహిస్తున్నారు.
యూట్యూబ్ చానల్ బోర్డు పెడితే ఎవరూ రారని ఈ పని.
యూట్యూబ్ చానల్స్ పెరిగిపోవడంతో పాటు..ఎవరు పడితే వారు ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఈమెయిల్ తో ఓ చానల్ సృష్టించుకుని మైకులు కొనుగోలు చేసి మీడియా పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏపీ 23 చానల్ పేరుతో భార్గవ్ అదే చేశారు. ఆ చానల్ లో ఎలాంటి వీడియోలు అప్ లోడ్ చేసినా చేయకపోయినా.. యూట్యూబ్ చానల్ బోర్డు మాత్రం పెట్టి.. తమ వైపు ఎవరూ రాకుండా చేసుకునేలా మాస్టర్ ప్లాన్ వేశారు. ఇలా చేసి.. పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నారు. వచ్చే వారంతా యూట్యూబ్ చానల్ పని మీద వస్తున్నట్లుగా చూపించి.. లోపల వ్యభిచారం పూర్తి చేస్తున్నారు.
నిందితుడు భార్గవ్ కోసం పోలీసుల వేట
కానీ పోలీసులకు సమాచారం అందడంతో అందర్నీ లోపలేశారు. ఏకంగా పది మంది యువతులను తీసుకు వచ్చారంటే.. ఒక్కొక్కరికి రోజుకు యాభై వేల రూపాయలు చెల్లించాల్సిఉన్నా.. రోజుకు ఆ మహిళకు ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని...అంటే రోజుకు.. ఈ వ్యవహారం ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సంపాదిస్తాడో సులువుగా అంచనా వేయవచ్చని అంటున్నారు. పోలీసులు భార్గవ్ ను పట్టుకుని ఆయన వెనుక ఉన్న ముఠా గురించి ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: డిన్నర్‌కు పిలిచి వివాహితపై సామూహిక అత్యాచారం, పరిచయం ఉందని వెళితే దారుణం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

