Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Andhra Pradesh CM CBN Phone Number:: సీఎం చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకున్న వారి కోసం ఫోన్ నెంబర్ ప్రకటించారు. ఈ ఫోన్ కు వచ్చే సమస్యలను చంద్రబాబు స్వయంగా పరిష్కారం దిశగా ఫాలో అప్ చేస్తారు.

Andhra Pradesh CM Chandra Babu Phone Number:: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నారు. అయితే ఆయన అందరికీ టచ్ లో ఉండటం అసాధ్యం కాబట్టి ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను తన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సిఎం చంద్రబాబు టోల్ ఫ్రీ నంబర్ ను 7306299999గా ఖరారు చేశారు. ప్రజలు నేరుగా చంద్రబాబుకు సమస్యలు చెప్పుకునేదుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ టోల్ ప్రీ నెంబర్ ను చంద్రబాబు మెయిన్ టెయిన్ చేయకపోయినా ఆయన ఆఫీసు చూసుకుంటుంది. ఈ ఫోన్ కు వచ్చేప్రతి కాల్ ను రికార్డు చేస్తారు. సమస్యను పరిష్కరిస్తారు. వ్యక్తిగత సమస్యలు.. ఇతర అంశాలను మాత్రం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
7306299999కు కాల్ చేస్తే నేరుగా సీఎం చంద్రబాబుకు సమస్య చెప్పుకున్నట్లే
ప్రజాసమస్యల పరిష్కార కోసం ప్రభుత్వం వివిధ స్థాయిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది. అలాగే పార్టీ ఆఫీసుల్లోనూ మంత్రుల స్థాయి నేతలు అందుబాటులో ఉండేలా చూశారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా చంద్రబాబును సంప్రదించేలా ఈ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు గతంలో నేరుగా టచ్ లో ఉండేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే వాటికి భిన్నంగా ఈ సారి టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశ పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను చంద్రబాబు అన్వేషిస్తారు.
సమస్య పరిష్కారంకోసం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా యంత్రాంగం
ఇప్పటికే వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్లికేషన్లు.. సమస్యల పరిష్కార దరఖాస్తులను పక్కన పడేయకుండా దానికి అకౌంటబులిటీ ఉండేలా చూస్తున్నారు. ఎంత మంది సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేస్తున్నారు. వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు. పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు. ఇలాంటి వివరాలతో సీఎంకు ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి అత్యధికంగా భూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రత్యేకంగా రెవిన్యూ సదస్సులు కూడా నిర్వహించారు. అందులో వచ్చిన సమస్యల్లో అత్యధికం భూవివాదాలు , 22ఏకు సంబంధించినవే.అందుకే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రజలకు మరింత చేరువగా చంద్రబాబు
గతంలో కూడా చంద్రబాబు నేరుగా ప్రజలతో మాట్లాడే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మరింత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న భావన వచ్చేలా ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే చంద్రబాబు నేరుగా ప్రజల సమస్యలకు స్పందిస్తున్నారన్న భావన ఏర్పడుతుంది.
Also Read: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు





















