How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
దాదాపు రెండేళ్ల తర్వాత 'జపాన్ ఓపెన్ 2026' గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ సంచలన విజయం వెనుక టీమిండియా ఐకాన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సీక్రెట్ అడ్వైస్ ఉందంటే నమ్ముతారా?
వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న సమయంలో సింధు కోహ్లీని కలవగా, "గేమ్ లోని అసలైన ఆనందాన్ని తిరిగి ఆస్వాదించడమే మైండ్‌సెట్‌ను మార్చుకునే మార్గం" అని ఆయన సూచించారు. కాలి బొటనవేలి గాయం తర్వాత, సింధు భర్త వెంకట దత్త సాయి ఆమెను అట్లాంటాలోని ఎక్సోస్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టి బ్యాడ్మింటన్‌పై ప్రేమను మళ్లీ పొందింది.
జపాన్ ఓపెన్ ఫైనల్‌లో అకానె యామగూచిని ఓడించినప్పుడు సపోర్ట్ టీమ్ మొత్తం ఎంతో ఎమోషనల్ అయ్యారు. స్పోర్ట్స్ సైన్స్ డేటా సహాయంతో తన అటాకింగ్ శైలిని మెరుగుపరుచుకున్న సింధు, ఈ టోర్నీ కోసం ఏకంగా 3.5 కేజీల బరువు తగ్గింది. మైండ్‌సెట్, పక్కా ప్లాన్, కోహ్లీ సలహానే సింధును మళ్లీ విజేతగా నిలబెట్టాయి.
ట్రెండింగ్ వార్తలు






















