బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ విన్నర్ ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసిందని తెలుసా?

సనా మక్బూల్... ఇప్పుడీ పేరు హిందీలో మార్మోగుతోంది. బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఈవిడ!

తెలుగు ప్రేక్షకులు కొందరికి సనా మక్బూల్ తెలుసు. ఎందుకంటే... ఆవిడ రెండు సినిమాలు చేసింది కనుక!

నాగ శౌర్య, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దిక్కులు చూడకు రామయ్య'.

'దిక్కులు చూడకు రామయ్య'లో తండ్రి కుమారులు ప్రేమించే అమ్మాయిగా సనా మక్బూల్ నటించారు.

తెలుగులో సనా మక్బూల్ రెండో సినిమా 'మామా ఓ చందమామ'. అందులో రామ్ కార్తీక్ హీరో.

'మామా ఓ చందమామ' తర్వాత సనా మక్బూల్ తెలుగులో సినిమాలు చేయలేదు.

సనా మక్బూల్ సినిమాలు కంటే హిందీలో రియాలిటీ షోలు ఎక్కువ చేశారు.

ఇప్పుడు హిందీ 'బిగ్ బాస్ ఓటీటీ' 3 విజేతగా నిలవడంతో సనా పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.

సనాకు కథానాయికగా తెలుగులో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. (All Images Courtesy: divasana / Instagram)