Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
Andhra Pradesh Group2 Exam:ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 వివాదం ఏపీపీఎస్సీ, ప్రభుత్వం మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. పోస్టు పోన్ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే అటు నుంచి స్పందన రావడం లేదు.

Andhra Pradesh Group2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 పరీక్ష గందరగోళంలో పడింది. అసలు పరీక్ష ఉంటుందో పోస్టుపోన్ అవుతుందో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్షలు వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన వాళ్లు వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
పోస్టు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా ఆ విన్నపాలను ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్ ప్రభుత్వం లేఖ రాసినా దానిపై ఇంత వరకు సమాధానం రాలేదు. ఇటు అభ్యర్థుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అవుతోంది.
రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం అభ్యర్థలు కోరిక మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. శుక్రవారమే ఆ లేఖను ఏపీపీఎస్సీకి రాసింది. లేఖ రాసి 24గంటలు అవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గ్రూప్ 2 పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటన చేయలేదు.
ప్రభుత్వం లేఖ రాయడమే కాకుండా ఇద్దరు నేతలను కూడా ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్ వద్దకు పంపించారు. ఆరోగ్యం బాగాలేదని ఆమె కలవలేదు. దీంతో వాళ్లిద్దరు తిరిగి వచ్చేశారు. విషయాన్ని ప్రభుత్వానికి చెప్పారు. తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించే తమకు నష్టం జరుగుతుందని చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. మధ్యాహ్నం వరకు ఓపిక పట్టిన ప్రభుత్వం లేఖ రాసిన విషయాన్ని మీడియాకు తెలియజేసింది.
ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఛైర్‌పర్శన్ కూడా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ ఫోన్ నెంబర్లు కూడా పని చేయడం లేదు. మీడియా సంస్థలకు అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పాలని రిక్వస్ట్‌లు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్‌గా అనురాధను నియమించారు. సిన్సియర్ ఆఫీసర్‌గా ఆమెకు పేరు ఉంది. ఏపీపీఎస్సీ కూడా స్వతంత్ర సంస్థ. దీన్ని రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నడపాలనే ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చి ఈ పోస్టులో పెట్టారు. ఇప్పుడు ఆమె ప్రభుత్వం మాట వినడం లేదని అంటున్నారు. ఆమె తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంసతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
Also Read: అనర్హతా వేటు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ - ఒక్క రోజు అసెంబ్లీకి జగన్
గ్రూప్2 వివాదంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాత్రి స్పందించారు. లీగల్ టీంతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిస్తామని ఎక్స్ వేదికగా అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. ఇంత పెద్ద ఇష్యూపై లోకేష్ స్పందించే సరికి పోస్టుపోన్ ఖాయమంటూ ప్రచారం మొదలైంది. ఇలా పోస్టుపోన్‌పై జరుగుతన్న ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. కానీ ప్రభుత్వం రాసిన లేఖపై మాత్రం స్పందించలేదు.
ఇప్పటికే ముఖ్యమంత్రికి, మంత్రులకు అధికారులపై పట్టు లేదని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా ప్రభుత్వం మాట వినికపోవడం చంద్రబాబును ఇరకాటంలో పెట్టే అంశంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. అందులోనూ స్వయంగా ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తే మాట వినకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

