అన్వేషించండి

YS Jagan: అనర్హతా వేటు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ - ఒక్క రోజు అసెంబ్లీకి జగన్

YSRCP: వైఎస్ జగన్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగం వినేందుకు ఆయన అసెంబ్లీకి వస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

YS Jagan will attend the assembly: వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అసెంబ్లీకి హాజరవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ...ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలన్న ఆలోచనే కారణం అంటున్నారు.   

జగన్ పై అనర్హతా వేటు వేస్తామంటున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్        

అసెంబ్లీకి హాజరు కాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు పదేపదే జగన్ అనర్హత గురించి మాట్లాడుతున్నారు. అయితే వారికి బుద్ది పుట్టింది చేసుకోనివ్వండి ని  అని జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్మీట్ లో స్పందించారు. అయితే అధికార పార్టీకి అవకాశం ఇవ్వకూడదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే ఆలోచన చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  కంటిన్యూస్ గా మూడు సెషన్లు లేదా.. అరవై రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ కు ఆ అర్హత వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి అవకాశం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిగతా పని పూర్తి చేస్తారు.         

అధికార పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక్క రోజు హాజరయ్యేలా ప్లాన్         

అసెంబ్లీకి హాజరు కాకపోయినా లీవ్ లెటర్ పంపినా అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. అయితే స్పీకర్ ఆ లీవ్ సమంజసమా కాదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ ఒక్క రోజు అసెంబ్లీకి పోతే అసలు సమస్య ఉండదు కదా అన్న ఆలోచన చేస్తున్నారు.  గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా ఒక్క రోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని  అనుకుంటున్నారు. 

మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం  ?            

పులివెందులలో ఉపఎన్నికల వస్తే ప్రజలు తమ సత్తా ఏంటో కూటమికి చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తోపాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడితే.. ప్రభుత్వ పవర్ తో ఆయా సీట్లలో గెలిచే ప్రయత్నం చేస్తుందని..అది వైసీపీకి మరింత సమస్యగా మారుతుందని అనుకుంటున్నారు. అందుకే అనర్హతా వేటు విషయంలో జగన్ కు ఎలాంటి భయం లేకపోయినా..  మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వైసీపీవర్గాలు చెబుతున్నాయి.           

Also Read: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్, ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Khairatabad Bypoll Janasena: ఖైరతాబాద్ ఉపఎన్నిక - జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఖైరతాబాద్ ఉపఎన్నిక - జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Embed widget