అన్వేషించండి

LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

AP Minister Nadendla Manohar | ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రజలకు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

అమరావతి: ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ఏపీలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గుడ్ న్యూస్ చెప్పారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. 

ఏపీలో పుష్కలంగా గ్యాస్ నిల్వలు

 ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని గ్యాస్ నిల్వలపై సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల ప్రకటనలు మాత్రమే నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్యాస్ సరఫరాలో ఏ ఇబ్బంది లేదు..

గ్యాస్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు- హస్సన్- చర్లపల్లి పైప్‌లైన్ ద్వారా సరఫరా సజావుగానే సాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకవేళ నిల్వలలో ఏదైనా తేడా వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఎల్పీజీ గ్యాస్ గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యత అని, అవసరమైతే వాణిజ్య అవసరాలకు ఇచ్చే సరఫరాను క్రమబద్ధీకరించి ప్రజలకు అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ సమయంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ధరలను ఇష్టానుసారంగా పెంచినా లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget