Sai Pallavi Looks for Wedding Events : హల్దీ ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు.. ట్రెడీషనల్ లుక్‌లో రెడీ అవ్వాలంటే సాయి పల్లవిని ఫాలో అయిపోండి
Looks for Wedding Event : పెళ్లిళ్ల సమయంలో ఫంక్షన్లకు వెళ్లాలంటే ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలో అని అమ్మాయిలు తెగ కంగారు పడిపోతారు. కానీ సాయిపల్లవిని ఫాలో అయితే సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ముస్తాబైపోవచ్చు.
Traditional Looks for Every Wedding Event : పెళ్లిళ్ల సీజన్లో అమ్మాయిలుకుండే అతి పెద్ద టాస్క్ ఏంటంటే ముస్తాబు కావడం. పెళ్లి తమది కాకపోయినా.. అందంగా కనిపించాలని.. ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది.. ఎలాంటి జ్యూవెలరీ పెట్టుకుంటే ఎలిగెంట్‌గా కనిపిస్తామనే డౌట్లో షాపింగ్ చేయడంలో ఫుల్ స్ట్రెస్ తీసుకుంటారు. అసలు ఈ బాధే లేకుండా.. ఎక్కువ జ్యూవెలరీ లేకుండా.. సింపుల్ లుక్‌లో ఎలిగెంట్‌గా కనిపించాలనుకుంటున్నారా?
హల్దీ ఫంక్షన్ నుంచి.. సంగీత్, పూజలు, పెళ్లి, రిసెప్షన్ వంటి కార్యక్రమాల్లో.. ఎక్కువ జ్యూవెలరీ లేకుండా.. సింపుల్‌గా, అందంగా, ఎలిగెంట్‌గా కనిపించేందుకు మీరు హీరోయిన్ సాయిపల్లవిని ఫాలో అయిపోవచ్చు. ఆభరణాలు పెట్టుకుంటేనే కాదు.. ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నాము.. వాటిని ఎంత అందంగా క్యారీ చేశాము.. అనేది మ్యాటర్ అంటోంది పల్లవి. తన సిస్టర్ మ్యారేజ్ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్‌లు, జ్యూవెలరీని మీరు కూడా ఫాలో అయిపోవచ్చు.
ఎంగేజ్మెంట్ వేడుకకు..
ఎంగేజ్మెంట్ సమయంలో చక్కగా పట్టుచీర కట్టుకుని.. సింపుల్ జ్యూవెలరీ వేసుకుని.. హెయిర్‌ని ఇలా స్టైల్ చేసుకుంటే చాలు. లుక్‌ని మరింత ఎలిగెంట్ చేసుకునేందుకు కుంకుమ పెట్టుకోవడం అస్సలు మరచిపోవద్దు. మినిమల్ మేకప్ వేసుకున్నా.. కళ్లకు మాత్రం ఐలైనర్ పెట్టుకోండి. ఇది మీ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.
హల్దీ ఫంక్షన్ కోసం..
పెళ్లి తంతులో భాగంగా హల్దీ వేడుకను కచ్చితంగా నిర్వహిస్తారు. పసుపు దంచిన తర్వాతే పెళ్లిపనులు ప్రారంభిస్తారు. ఇలాంటి హల్దీ ఫంక్షన్ సమయంలో మీరు శారీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ గౌన్ని కూడా మీరు హల్దీ వేడుకకు వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ మీకు ట్రెడీషనల్ లుక్‌ని ఇవ్వడంతో పాటు.. ట్రెండ్‌కి తగ్గట్లు కనిపించేలా చేస్తాయి. పైగా ఆ సమయంలో ఎక్కువగా నీళ్లతో ఆడుకుంటారు కాబట్టి ఇలాంటి దుస్తులు బెస్ట్ ఆప్షన్. చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరి.
సంగీత్ సమయంలో..
సంగీత్ వేడుకలో మీరు ఇలాంటి లాంగ్ కుర్తాను.. మ్యాచింగ్ లాంగ్ ఫ్రాక్‌తో మ్యాచ్ చేయవచ్చు. ఇవి సంగీత్ వైబ్స్‌ని రెట్టింపు చేస్తాయి. టాప్ గ్రాండ్‌గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఆభరణాలు వేసుకోకపోయినా అందంగానే కనిపిస్తారు. ముఖ్యంగా డ్యాన్స్ చేసే సమయంలో జ్యూవెలరీ అడ్డుగా ఉండకూడదనుకుంటే మీరు ఇలాంటి లుక్‌ని సంగీత్ కోసం ఎంచుకోవచ్చు.
పెళ్లి తంతులో..
పెళ్లి సమయంలో పెళ్లికూతురు సింపుల్ చీరలో కనిపిస్తుంది. కానీ కొందరు పెళ్లికూతురు కాకపోయినా.. పెళ్లి కూతురులా ముస్తాబైపోతారు. కానీ వారి పెళ్లిలో మీరు ఎక్కువగా ముస్తాబైతే స్పెషల్ ఏముంటుంది. వారంటూ స్పెషల్‌గా ఉంచాలనుకుంటే.. మీరు అంతే సింపుల్ లుక్‌ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ట్రెడీషనల్గా పెళ్లి జరుగుతున్నప్పుడు.. ఇలా శారీ కట్టుకుని.. వైట్ లేదా క్రీమ్ శారీ కట్టుకుంటే ముత్యాల దండతో కూడా అందంగా కనిపించవచ్చు. మీ లుక్‌ని మరింత ట్రెడీషనల్గా మార్చుకునేందుకు పూలు, కుంకుమ పెట్టుకుంటే లక్ష్మీ కళ మీ దగ్గర ఉట్టిపడుతుంది.
పూజా, మెహందీ వేడుకల్లో..
పెళ్లి తర్వాత జరిగే పూజలు, కార్యక్రమాలకు మీరు కూడా ఇలా రెడీ అయిపోవచ్చు. హల్దీ సమయంలో ఇలాంటి రెడ్ శారీ కట్టుకుని సింపుల్‌గా చౌకర్ పెట్టుకోవచ్చు. హెయిర్ లీవ్ చేసి స్టైయిల్ చేయవచ్చు. అలాగే పూజకు సింపుల్‌గా చీరకట్టుకుని హాజరైపోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి ఇలాంటి ఫంక్షన్లకు వెళ్లేప్పుడు హెవీ జ్యూవెలరీ లేకపోయినా.. సింపుల్‌గా ట్రెడీషనల్ లుక్స్‌లో రెడీ అయిపోండి. సాయిపల్లవి శారీ, డ్రస్సింగ్ లుక్స్‌ని వివిధ ఫంక్షన్లు, కార్యక్రమాలకు ఫాలో అవ్వాలనుకుంటే ఆమె ఇన్‌స్టాలో మరిన్ని లుక్స్ ఉన్నాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తన సొంత చెల్లికి సంబంధించిన ప్రతి ఫంక్షన్లోనూ పల్లవి సింపుల్‌గా రెడీ అయి.. తన సిస్టర్ని స్పెషల్‌గా ట్రీట్ చేసింది. అలాగే పెళ్లికూతురు మీరేనా అనిపించేలా ముస్తాబుకావాల్సిన అవసరం లేదు. మీ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంటే చాలు.
Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్‌గా ముస్తాబై, స్టన్నింగ్‌గా కనిపించాలంటే కీర్తి సురేష్‌ని ఫాలో అయిపోండిలా