Keerthy Suresh Saree Looks : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్‌గా ముస్తాబై, స్టన్నింగ్‌గా కనిపించాలంటే కీర్తి సురేష్‌ని ఫాలో అయిపోండిలా
Fashion : ఫంక్షన్ల సమయంలో సింపుల్‌గా ముస్తాబై ఎలిగెంట్‌గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీరు కీర్తి సురేష్ డ్రెస్సింగ్ స్టైల్‌ని ఫాలో అయిపోవచ్చు. ఏయే సమయాల్లో ఎలాంటి లుక్ బాగా నప్పుతుందో చూసేద్దాం.
Keerthy Suresh Fashion : పెళ్లిళ్ల సమయం వచ్చేసింది. ఈ సమయంలో హల్దీ ఫంక్షన్లంటూ, పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేయడం, పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమయంలో పెళ్లిల్లకు వెళ్లేందుకు ఎలా ముస్తాబు కావాలి? ఒక్కో ఈవెంట్‌కి ఎలా ముస్తాబు కావొచ్చు.. సింపుల్ లుక్‌తో స్టన్నింగ్‌గా ఎలా కనిపించవచ్చు.. ఎలాంటి డ్రెస్‌లు ఎంచుకోవచ్చనేది చాలామంది అమ్మాయిలకు, మహిళకు ఉండే అతిపెద్ద ప్రశ్న. మీరు కూడా అలాంటి సందిగ్ధంలో ఉంటే మీరు కీర్తి సురేష్ స్టైల్‌ని ఫాలో అవ్వొచ్చు.
లెహంగా స్టైల్స్
పెళ్లి లేదా ఏ ఫంక్షన్ అయినా.. లెహంగాలు ఈజీ గో అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ మాదిరిగా.. లెహంగా ధరిస్తే హెయయిర్ లీవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా ముడి పెట్టుకుని పువ్వులు పెట్టుకోవచ్చు. అలాగే మెడలో భారీ స్టోన్స్‌తో కూడిన నెక్లెస్, దానికి తగిన ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. మినిమల్, షైనీ మేకప్ లుక్ ఈ తరహా లెహంగా లుక్‌కి బాగా నప్పుతుంది.
ఈవెనింగ్ ఫంక్షన్లకు
షైనీ లుక్‌తో వచ్చే శారీ, బ్లౌజ్‌లు ఈవెనింగ్ ఫంక్షన్లకు బాగా హెల్ప్ అవుతాయి. లైట్స్ కింద ఉన్నప్పుడు వాటి షైన్ మీకు మరింత గ్లామర్‌ని లోడ్ చేస్తాయి. అయితే నైట్ ఫంక్షన్లకు బ్లౌజ్ డిజైన్స్ ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీతో.. లుక్‌ని ఫైనల్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయితే సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తారు.
టీనేజ్ అమ్మాయిలైతే..
టీనేజ్ అమ్మాయిలు ఫంక్షన్లకు శారీలు, లెహంగాలు అవాయిడ్ చేయాలనుకుంటే మంచిగా ఇలాంటి డ్రెస్‌ని సెలక్ట్ చేసుకోవచ్చు. హల్దీ ఫంక్షన్లు వాటికి కూడా ఈ లుక్ అద్భుతంగా సెట్ అవుతుంది. డ్రెస్‌కి తగ్గట్లు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే హెయిర్ లీవ్ చేయకుండా ఇలా జడ వేసుకుంటే యూ లుక్ పర్ఫెక్ట్.
గోల్డెన్ శారీ
గోల్డెన్ రంగు ఉండే ఏ శారీ అయినా.. ఏ ఫంక్షన్‌కి అయినా సెట్ అవుతాయి. ఇలాంటి శారీ మీరు కట్టుకున్నప్పుడు బ్లౌజ్‌ని కాస్త డిజైన్ వచ్చేలా కుట్టించుకుంటే.. లుక్ అదిరిపోతుంది. మెడకి చౌకర్, చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు వేసుకుని.. సింపుల్‌గా ముస్తాబైైనా గ్రాండ్‌గా కనిపిస్తారు.
సంగీత్ లేదా బ్యాచిలర్ పార్టీ
పెళ్లిల్ల సమయంలో సంగీత్ లేదా బ్యాచిలర్ పార్టీకి వెళ్లేప్పుడు ఇలా మోడ్రన్ బాడీకాన్ డ్రెస్‌లో వెళ్లొచ్చు. మోడ్రన్ లుక్ ఎంచుకుంటే హెయిర్‌ని స్టైల్ చేయకుండా స్ట్రైట్ చేయించుకోండి. అలాగే శారీ లుక్‌లో వెళ్లాలనుకుంటే స్లీవ్ లెస్ బ్లౌజ్‌ని ఎంచుకోవచ్చు.
ఎంబ్రాయిడరీ శారీ లేకుంటే ఎలా
ఎంబ్రాయిడరీ శారీలు పెళ్లిల్లు, ఫంక్షన్లు, రిసెప్షన్లు, పూజలు.. ఇలా ఏ లుక్కైనా.. ఏ వయసువారికైనా మంచి లుక్‌ని ఇస్తాయి. ముఖ్యంగా ఇలాంటి పింక్, సిల్వర్ కాంబినేషన్లో వచ్చేవి కూడా మంచి లుక్‌ని ఇస్తాయి. జ్యూవెలరీ సెట్, గాజులు, పువ్వులు ఉంటే చాలు. మీ లుక్ కంప్లీట్ అయిపోతుంది.
మళ్లు కుట్టీ లుక్
ఓనమ్ సమయంలో మలయాళీలు ముస్తాబైనట్లు వైట్ లేదా క్రీమ్ శారీని కట్టుకుని ఎలాంటి జ్యూవెలరీ పెట్టుకోకుండా.. గ్లోయింగ్ మేకప్ లుక్ వేసుకుంటే చాలు. అందమైన లుక్ మీ సొంతమవుతుంది.
అన్నీ లుక్స్ కూడా సింపుల్, ఎలిగెంట్ లుక్స్‌ని ఇస్తాయి. మినిమల్ మేకప్ అయినా.. వేసుకునే డ్రెస్, వాటిని క్యారీ చేసే విధానం మిమ్మల్ని గ్లామర్‌గా ఉండేలా చేస్తుంది. కీర్తి సురేష్ ఇదే ఫార్మూలాను ఫాలో అవుతుంది. మీరు కూడా ఫంక్షన్ల సమయంలో స్టన్నింగ్‌గా కనిపించేందుకు కీర్తి సురేష్ లుక్స్‌ని ఫాలో అయిపోవచ్చు.
Also Read : శోభిత ధూళిపాల స్కిన్ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ